చేతులు ముడుచుకొని కూర్చోం…

త‌న సోద‌రి నారా భువ‌నేశ్వ‌రిపై వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడితే స‌హించేది లేద‌ని టాలీవుడ్ అగ్ర‌హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌దైన స్టైల్‌లో హెచ్చ‌రించారు.  Advertisement నిన్న‌టి చంద్ర‌బాబు క‌న్నీటి ఎపిసోడ్ నేడు…

త‌న సోద‌రి నారా భువ‌నేశ్వ‌రిపై వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడితే స‌హించేది లేద‌ని టాలీవుడ్ అగ్ర‌హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌దైన స్టైల్‌లో హెచ్చ‌రించారు. 

నిన్న‌టి చంద్ర‌బాబు క‌న్నీటి ఎపిసోడ్ నేడు మ‌రో రూపంలో కొన‌సాగింది. ఇందుకు కొన‌సాగింపుగా భువ‌నేశ్వ‌రి కేంద్రంగా ఆమె కుటుంబ స‌భ్యులు బాల‌కృష్ణ ఇంట్లో మీడియా సమావేశం నిర్వ‌హించారు. త‌మ సోద‌రి భువ‌నేశ్వ‌రికి మ‌ద్ద‌తుగా నిలిచారు.

ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీడియా స‌మావేశంలో బాల‌కృష్ణ ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే ….

‘ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైంది. అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండాను తీసుకొచ్చారు. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉండే మనిషి. ఎప్పుడూ ఆయన కంటతడి పెట్టలేదు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆనవాయితే. అయితే కుటుంబ సభ్యులపై దాడి సరికాదు. మేం వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎవరిని విమర్శించలేదు. మా సోదరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాగాలేదు. అసెంబ్లీలో ఉన్నామో.. పశువుల దొడ్డిలో ఉన్నామో అర్థం కావడం లేదు. రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాటల దాడి సరికాదు. ఆ పార్టీలోనూ బాధపడే వారున్నారు’

‘ప్రజలు, పార్టీ, నా అభిమానుల తరఫున ఇదే నా హెచ్చరిక. మళ్లీ ఇలాంటి నీచపు, నికృష్టపు మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఖబడ్దార్‌. భరతం పడతాం. ప్రతి విషయానికి హద్దు ఉండాలి. ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకొని కూర్చోం. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం చంద్రబాబుపై దాడులకు యత్నించినా సంయమనంతో ఉన్నాం. ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదు’ అని బాలకృష్ణ హెచ్చరించారు.

బాల‌కృష్ణ‌తో పాటు నంద‌మూరి కుటుంబ స‌భ్యులు ప‌లువురు మాట్లాడారు. మ‌రీ ముఖ్యంగా నంద‌మూరి రామ‌కృష్ణ మాట్లాడుతూ కొడాలి నాని, అంబ‌టి రాంబాబు, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిల‌ను ఒరేయ్ అంటూ హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యారు. ఇక‌పై ఇలాంటివి పున‌రావృతం అయితే ఊరుకునేది లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.