నాగచైతన్యతో విడిపోయాక సమంత చాలా త్వరగానే కోలుకున్నారు. సాధారణ జీవితంలోకి ఆమె వచ్చారు. తన కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునే పనిలో సమంత బిజీ అయ్యారు. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా ఆమె ఎప్పట్లాగే యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య బ్రేకప్ తర్వాత ఫస్ట్ టైం సోషల్ మీడియాలో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
సమంతతో బ్రేకప్ తర్వాత మొదటిసారి ఇన్‌స్టాలో నాగచైతన్య చేసిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. అది కూడా ఓ పుస్తకంపై కావడం విశేషం. సాధారణంగా చై సినిమాలు, బైకులు, కార్ల గురించి మినహా, ఇతర సంగతులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడు. అలాంటిది చైని కట్టి పడేసిన ఆ పుస్తకం ఏంటో తెలుసుకుందాం.
ప్రముఖ రచయిత మాథ్యూ రాసిన 'గ్రీన్ లైట్స్' అనే పుస్తకాన్ని షేర్ చేసిన చైతూ ఆసక్తికర కామెంట్ చేశాడు. 'లవ్ లెటర్స్ టూ లైఫ్..మీ జర్నీని షేర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు మాథ్యూ.. ఈ పుస్తకం నాకు నిజంగా గ్రీన్ లైట్ (జీవితంలో ముందుకు వెళ్లడం)' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.
ప్రేమ, జీవితం గురించి కామెంట్స్ చేశాడంటే… అందులో తన జీవితాన్ని టచ్ చేసే అంశాలేవో ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.