నా పేరు: నిమ్మగడ్డ రమేష్ కుమార్
దరఖాస్తు చేయు ఉద్యోగం: ఎన్నికల సంస్కర్త (ఎన్నికల కమిషనర్గా పదవీ విరమణ చేశాక, ఈ ఉద్యోగం సరయినది గా అనిపించింది. అందుకేగా పదవినుంచి దిగిపోతూ ఎన్నికల సంస్కరణలు సూచించాను. అసలు ఎన్నికల కమిషనర్నే ‘కులీ’జియం (అదే లెండి, కొలీజియం) ద్వారా నియమించాలని సూచించాను. నన్ను చంద్రబాబు నాయుడు నియమించేటప్పటికి ఇలాంటిది లేక పోయినా, ‘కుల’మానాల్ని (అదే లెండి కొలమానాల్ని) పక్కన పెట్ట లేదు.
వయసు: ఏం చెప్పమంటారు. సగం వయసు కోర్టుల చుట్టూరా తిరగటానికే సరిపోయింది.
ముద్దు పేర్లు: 'తెలుగు' గడ్డ రమేష్ కుమార్ ( తెలుగు గడ్డ గర్వించ దగ్గ ఐయ్యేఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్నాను. కానీ కొన్ని పత్రికల్లో ఇదే అంశాన్ని అచ్చుతప్పుల్తో ప్రచురిస్తున్నారు. 'తెలుగు దేశం గర్వించ దగ్గర అధికారి' నని రాస్తున్నారు. ఎవరికెలా కనిపించినా నేను మాత్రం ‘ప్రతిపక్ష పాతి’ని… సారీ ‘నిష్పక్షపాతి’ని.)
విద్యార్హతలు: నా తో పెట్టుకోకండి. 'లా' తో కొడతాను. అని అనేవాణ్ణి. కానీ అదేమిటి? నేను చూస్తుండగానే జనం 'వోటు'తో కొట్టేశారు. 'అంపైర్ మనవాడయినా, ఆట అటు వైపు వెళ్తుంది' ఈ పాఠం నేను కూడా అంపైర్ గా వుండి మరీ నేర్చుకున్నాను.
విలాసం: ఇంకెక్కడ? తెలుగు దేశంలోనే. ఐమీన్ దేశమంటే దేశం కాదు. తెలుగు రాష్ర్టంలోనే.
గుర్తింపు చిహ్నాలు: ఒకటి: కరెక్టుగా చంద్రబాబు ఎలా ఆలోచిస్తారో, నేనూ అలా ఆలోచిస్తాను. ఇద్దరమూ ఒకే సబ్జెక్టు (ఎకనమిక్స్) చదివాం, గ్రేట్ మన్ థింక్ ఎలైక్ అంటారు. గ్రేట్ మన్ ఫాల్ ఎలైక్ అని కూడా అన్నారా, ఎవరయినా, కొంపతీసి?
రెండు: రాజ్ భవన్. ఎక్కువ కాలం గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అక్కడే పనిచేశాను. చిత్రం. ఎన్నికల కమిషనర్గా పదవీ విరమణకు చివరి రోజు మాత్రం అదే గవర్నర్ అప్పాయింట్ మెంట్ కోసం ఎదురు చూశాను.
సిధ్ధాంతం: మరీను. ఇష్టమైన రంగు అంటే 'పసుపు' అని చెప్పగలం కానీ, సిధ్ధాంతమేమిటంటే, ఏమి చెబుతాం? అఫ్ కోర్స్ 'వర్ణమే' సిధ్ధాంతమనుకోండి. అలాంటప్పుడు నమ్మిన 'వర్ణాని'కి ద్రోహం చెయ్యవచ్చా? నేనయితే పదవి పోయినా సరే, చెయ్యలేదు. దటీజ్ మై ‘కమ్మిట్మెంట్’.
వృత్తి: ఏకగ్రీవాలు జరగకుండా చూడటం.
హాబీలు: 1. ప్రభుత్వం ఎన్నికలు జరపమంటే వాయిదా వెయ్యటం.
2. ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వెయ్యమంటే జరపటం.
అనుభవం: కుర్చీలో కూర్చున్నంత వరేక 'మన' వాడు. దిగిపోయాక 'ఎవడో వాడు.'.
మిత్రులు: నన్ను ఎవరు కుర్చీలో కూర్చోబెడితే వారే నా మిత్రులు.
శత్రువులు: నా 'మిత్రుడి'కి ఎవరు శత్రువులో, వారే నా శత్రువులు.
మిత్రశత్రువులు: నా సాటి అధికారుల్లో కోకొల్లలు.
జీవిత ధ్యేయం: చరిత్ర పుటల్లో నిలిచిపోవటం. ఆంధ్రప్రదేశ్లో వివాదాస్పద ఎన్నికల కమిషనర్ ఎవరంటే, జనం నా పేరే చెప్పుకోవాలి.
సర్