బీజేపీ అస‌త్య‌కుమార్ వాక్కు…

బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి స‌త్య‌కుమార్ పేరును అడ్జెంట్‌గా మార్చాల్సిందేన‌నే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో స‌త్య‌కుమార్ త‌న పేరుకు విరుద్ధంగా వ్యాసాలు రాయ‌డం, మీడియా స‌మావేశాల్లో చెబుతున్నార‌నేది అంద‌రి భావ‌న‌.  Advertisement…

బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి స‌త్య‌కుమార్ పేరును అడ్జెంట్‌గా మార్చాల్సిందేన‌నే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో స‌త్య‌కుమార్ త‌న పేరుకు విరుద్ధంగా వ్యాసాలు రాయ‌డం, మీడియా స‌మావేశాల్లో చెబుతున్నార‌నేది అంద‌రి భావ‌న‌. 

పేరే స‌త్య‌కుమార్‌, చేష్ట‌ల‌న్నీ అస‌త్యాల‌నే అభిప్రాయాలున్నాయి. కేంద్ర బ‌డ్జెట్‌పై తిరుప‌తిలో నిర్వ‌హించిన అవ‌గాహ‌న స‌ద‌స్సులో స‌త్య‌కుమార్ ప్ర‌సంగిస్తూ విశాఖ ఉక్కుపై ఏపీ స‌ర్కార్‌కు చిత్త‌శుద్ధి లేద‌ని విమ‌ర్శించారు.

2017-19 మధ్య విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఆరు సమావేశాలు జరిగితే.. రాష్ట్రం నుంచి ఒక్క ప్రతినిధి కూడా హాజరుకాలేదని సత్యకుమార్ ఆరోపించారు. స‌మావేశాల‌కు రాని రాష్ట్ర ప్ర‌భుత్వానికి విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై  చిత్తుశుద్ధి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఈ వార్త‌ను ప్ర‌జెంట్ చేయ‌డంలో ఎల్లో మీడియా అతి తెలివి తేట‌లు ప్ర‌ద‌ర్శించ‌డాన్ని కూడా గ‌మ‌నించాలి. 2017-19 మ‌ధ్య కాలంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలో ఉంది.

అందుకే స‌త్య‌కుమార్ ఆరోప‌ణ‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం అని హైలెట్ చేయ‌డం ద్వారా జ‌గ‌న్ స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త‌ను క‌లిగించాల‌నే కుట్ర ఎల్లో మీడియా వార్త‌ను ప్ర‌జెంట్ చేయ‌డంలో క‌నిపించింది. అయితే ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై ఏర్పాటు చేసిన స‌మావేశాల‌కు వెళ్ల‌నంత మాత్రాన ప్రైవేట్ ప‌రం చేస్తారా? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌త్య‌కుమార్ స‌మాధానాలు చెప్పాలి. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వ్య‌క్తిగా విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కాపాడాల్సింది పోయి, స‌మ‌ర్థించేలా కేంద్ర ప్ర‌భుత్వాన్ని వెన‌కేసుకు రావ‌డం స‌బ‌బేనా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు కేంద్ర ఆర్థిక‌శాఖ స‌హాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ హైద‌రాబాద్‌లో మాట్లాడుతూ  నీతి ఆయోగ్‌ సూచన మేరకు, పారదర్శక విధానంలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌ప‌రం చేయాల‌ని కేంద్రం  నిర్ణయం తీసుకుంద‌న్నారు. 

పనితీరును బట్టి నీతి ఆయోగ్‌ ప్రభుత్వరంగ సంస్థల్ని వ్యూహాత్మకమైనవి, వ్యూహాత్మకం కానివిగా నిర్ణయించింద‌న్నారు. ఆ క్రమంలోనే విశాఖ స్టీల్‌పై నిర్ణయం తీసుకున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. కేంద్ర పెద్ద‌ల ప్రాప‌కం కోసం వారి అడుగుల‌కు మ‌డుగులొత్తుతూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టే అస‌త్య‌కుమార్‌ల వ‌ల్ల ఎవ‌రికి లాభం? ప‌్ర‌జ‌ల‌తో ఏ మాత్రం సంబంధం లేని నాయ‌కులంతా …ప్ర‌జాభిప్రాయాల గురించి నీతులు వ‌ల్లిస్తుండ‌డం విషాదం. 

మెగాఫ్యామిలీ మొత్తానికి నచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి ఆ రిస్కు తీసుకుంటారా?