దేశంలో బీజేపీ రాజ్యాంగం

భారత దేశానికి అంబేద్కర్ రాజ్యాంగం రాశారు కదా. మరి బీజేపీ రాజ్యాంగమేంటి అంటే ఉంది అంటున్నారు కమ్యూనిస్ట్ వ్రుధ్ధ నేత నారాయణ. బీజేపీ దేశంలో తనకు అనుకూలంగా అన్ని వ్యవస్థలను మార్చేస్తోందని ఆయన అంటున్నారు.…

భారత దేశానికి అంబేద్కర్ రాజ్యాంగం రాశారు కదా. మరి బీజేపీ రాజ్యాంగమేంటి అంటే ఉంది అంటున్నారు కమ్యూనిస్ట్ వ్రుధ్ధ నేత నారాయణ. బీజేపీ దేశంలో తనకు అనుకూలంగా అన్ని వ్యవస్థలను మార్చేస్తోందని ఆయన అంటున్నారు.

ఈ దేశంలో సీఏఏ పేరిట రాజ్యాంగ విద్వంసానికి  బీజేపీ తెరతీసిందని సీపీఐ నారాయణ‌ ఫైర్ అయ్యారు. మత రాజకీయాలతో దేశాన్ని చిన్నాభిన్నం చేయాలన్నదే బీజేపే అజెండా అని ఆయన హాట్ కామెంట్స్ చేసారు.

ఈ దేశంలో  మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి పదవులు చేసిన వారి వారసులు కూడా తన గుర్తింపు కార్డులు చూపించి తామూ భారత్  పౌరులమేని నిరూపించుకోవాల్సిరావడం కంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

అస్సాం మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి దేశ రాష్ట్రపతి ఫక్రుద్ధీన్ ఆలీ అహ్మద్ మనవలు కూడా ఈ దేశంలో తాము పౌరులమేనని చెప్పుకోవడానికి గుర్తింపుకార్డులు ఇవ్వాలంటే ఈ దేశం ఎటుపోతోందో అర్ధం కావడం లేదని నారాయణ అన్నారు. ఆర్ధికంగా దేశాన్ని దివాలా తీయించేసారు. ఎంతసేపూ పాకిస్థాన్ బూచిని చూపించి దేశంలో మతతత్వాని రెచ్చగొడుతున్నారని నారాయణ మండిపడ్డారు.

ఇపుడు దేశంలో అచ్చంగా బీజేపీ రాజ్యాంగమే అమలవుతోందని, దాన్ని కాదన్న వారంతా దేశద్రోహులుగానే ఆ పార్టీ చిత్రీకరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మోడీ షాలకు తప్ప ఎవరికీ స్వేచ్చ లేకుండా చేస్తున్నారని ఆయన ఆందోళన చెందారు.

ఇక ఏపీలో మూడు రాజధానులపైనా తనదైన శైలిలో సెటైర్లు వేసిన నారాయణ విశాఖను రాజధాని చేస్తామంటున్న జగన్ ముందు ఇక్కడ నాలుగు వేల ఎకరాల పై చిలుకు ప్రభుత్వ   భూమి కబ్జా కోరల్లో చిక్కుకుందని, దాన్ని విడిపిస్తే చాలు అని  అంటున్నారు. మొత్తాని ఎర్రన్న కోపం అందరి మీద ఒకేసారి చూపించేస్తున్నారు.

కులాలకు సంబంధించి  త్వరలో పుస్తకం రాస్తాను