Advertisement

Advertisement


Home > Movies - Movie News

స‌మంత కింద‌ప‌డి ఎందుకు ఏడ్చిందంటే...

స‌మంత కింద‌ప‌డి ఎందుకు ఏడ్చిందంటే...

‘రంగ‌స్థ‌లం’ సినిమాలో ‘రామ‌ల‌క్ష్మి’ పాత్ర కొన్నాళ్ల పాటు ఎలా ప్రేక్ష‌కుల్ని వెంటాడిందో...ఇప్పుడు ‘జాను’లో ‘జాను’ పాత్ర కూడా అలా వెంబ‌డిస్తుంద‌ని క‌థానాయిక స‌మంత భ‌రోసా ఇస్తున్నారు. శ‌ర్వానంద్‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్న జాను సినిమా ఈ నెల 7న విడుద‌ల కానుంది. చిత్ర విశేషాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా ఆమె పంచుకున్నారు.

‘నా సినిమా ప్ర‌యాణానికి ప‌దేళ్లు. మ‌హా అయితే మ‌రో రెండేళ్లు న‌టిస్తానేమో. ఆ త‌ర్వాత కూడా నా గురించి మాట్లాడుకోవాల‌నే ఉద్దేశంతో ‘జాను’ లాంటి పాత్ర‌లో న‌టించాను. ఈ నెల 7 త‌ర్వాత జాను సినిమాలోని రామ్‌, జాను పాత్ర‌లు మీతో పాటు ఇంటికి వ‌స్తాయి. కొన్నాళ్ల‌పాటు మిమ్మ‌ల్ని వెంటాడుతాయి. ఆ భ‌రోసా నాది’ అని మ‌రో కొన్ని గంట‌ల్లో విడుద‌ల కానున్న‌ సినిమా గురించి స‌మంత కుషీకుషీగా చెప్పారు.

  తాను ఈ సినిమా చేయ‌క‌పోయి ఉంటే మంచి అనుభూతిని, అనుభ‌వాన్ని కోల్పోవాల్సి వ‌చ్చేదని ఆమె చెప్పారు. ఎందుకంటే న‌వ‌త‌ర‌మే కాదు, పెద్ద‌వాళ్లు కూడా త‌న పాత్రలో వాళ్ల‌ని వాళ్లు చూసుకుంటార‌ని వివ‌రించారామె.

‘నేను ఒక ల‌క్ష్యం నిర్దేశించుకున్నానంటే దాన్ని సాధించాల్సిందే అన్న ప‌ట్టుద‌ల‌తో ఉండేదాన్ని. కామ‌ర్స్‌లో వంద‌శాతం మార్కులొస్తాయ‌ని అనుకున్నా. కానీ ఒక్క మార్క్ త‌గ్గేస‌రికి కింద‌ప‌డి ఏడ్చేశాను. మా అమ్మేమో ఫెయిల్ అయ్యిందేమో అనుకున్నార‌ట‌. అస‌లు విష‌యం తెలిసి అవాక్క‌య్యారు. సినిమాల్లోకి వ‌చ్చాక కూడా నా తీరు మార‌లేదు’ అని చ‌దువుకునే రోజుల్ని, మ‌ధుర స్మృతుల‌ను ఈ సంద‌ర్భంగా ఆమె నెమ‌రు వేసుకున్నారు.  

సినిమాల్లో అదృష్టం క‌లిసొస్తుంటుంద‌ని, రంగ‌స్థ‌లం విష‌యంలో అదే జ‌రిగింద‌న్నారు. నిజం చెప్పాలంటే త‌న‌కు ఆ సినిమా క‌థ గురించి కూడా పూర్తిగా తెలియ‌ద‌ని, కేవ‌లం రామ‌ల‌క్ష్మి పాత్ర గురించి తెలుసుకుని న‌టించిన‌ట్టు స‌మంత ఉత్సాహంగా చెప్పుకుపోయారు.

‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌లో తాను రొటీన్‌కు భిన్నంగా విల‌న్ రోల్‌లో క‌నిపించ‌నున్న‌ట్టు చెప్పి త‌న అభిమానుల్ని ఆమె ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అంతేకాదు ఈ వెబ్ సిరీస్‌లో ఫైట్స్ కూడా చేశాన‌ని, ఒక్క ఫైట్‌లో కూడా డూప్ స‌హాయం తీసుకోకుండా చేసిన‌ట్టు స‌మంత థ్రిల్లింగ్ విష‌యాలతో ముగించారు.

ఓ తండ్రిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?