మొన్న‌టి వ‌ర‌కూ హ‌రీష్ రావు పై సానుభూతి, ఇప్పుడేంటి?

మొన్న‌టి వ‌ర‌కూ తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత హ‌రీష్ రావు పై భార‌తీయ జ‌న‌తా పార్టీ వాళ్లు ఉచితంగా ట‌న్నుల ట‌న్నుల సానుభూతి ప్ర‌క‌టించారు. టీఆర్ఎస్ లో హ‌రీష్ కు అన్యాయం జ‌రుగుతోంద‌ని, హ‌రీష్…

మొన్న‌టి వ‌ర‌కూ తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత హ‌రీష్ రావు పై భార‌తీయ జ‌న‌తా పార్టీ వాళ్లు ఉచితంగా ట‌న్నుల ట‌న్నుల సానుభూతి ప్ర‌క‌టించారు. టీఆర్ఎస్ లో హ‌రీష్ కు అన్యాయం జ‌రుగుతోంద‌ని, హ‌రీష్ లేనిది టీఆర్ఎస్ లేద‌ని, మేన‌మామ‌ను న‌మ్ముకుని హ‌రీష్ రావు అన్యాయం అయిపోతున్న‌ట్టుగా క‌మ‌లం పార్టీ వాళ్లు వ్యాఖ్యానించారు.

హ‌రీష్ రావు..హ‌రీష్ రావు.. అంటూ బీజేపీ వాళ్లు క‌ల‌వ‌రింత‌లు చేసిన‌ట్టుగా మాట్లాడారు.క‌ట్ చేస్తే.. దుబ్బాక సీన్లో హరీష్ రావు దిగే స‌రికి క‌మ‌లం పార్టీ టోన్ మారింది. హరీష్ రావుపై ఇప్పుడు బీజేపీ విమ‌ర్శ‌ల ఘాటు పెంచింది.

కేసీఆరే చెడ్డోడు, హ‌రీష్ మంచోడు అన్న‌ట్టుగా మొన్న‌టి వ‌ర‌కూ మాట్లాడిన బీజేపీ ముఖ్య నేత‌లు ఇప్పుడు డైరెక్టుగా హ‌రీష్ రావు మీద విమ‌ర్శ‌ల జ‌డి కురిపిస్తున్నారు. హ‌రీష్ రావు కుట్ర‌లు చేస్తున్నాడన్న‌ట్టుగా వీరు స్పందిస్తున్నారు!

ఉన్న‌ట్టుండి బీజేపీ వాళ్ల మాట‌ల్లో ఈ మార్పు క‌నిపిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల ప్రచార ఆరంభ స‌మ‌యంలో.. హ‌రీష్ రావే త‌మ రాజ‌కీయ అంశం అన్న‌ట్టుగా స్పందించిన క‌మ‌లం పార్టీ వాళ్లు, ఇప్పుడు మాత్రం హ‌రీష్ రావే త‌మ శ‌త్రువు,.

హ‌రీష్ రావే త‌మ ప్ర‌త్య‌ర్థి అన్న‌ట్టుగా రియాక్ట్ అవుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక‌ల విష‌యంలో హ‌రీష్ రావు పూర్తిగా రంగంలోకి దిగే స‌రికి క‌మ‌లం పార్టీ తీరులో ఈ మార్పు సుస్ప‌ష్టంగా క‌నిపిస్తూ ఉంది. 

అంత పెద్ద బీజేపీకి ఒక ఉప ఎన్నిక‌లో హ‌రీష్ రావు మాత్ర‌మే రాజ‌కీయాంశంగా మార‌డం గ‌మ‌నార్హం. గ‌త రెండు ప‌ర్యాయాల్లోనూ దుబ్బాక‌లో బీజేపీ మూడో స్థానంలో మాత్ర‌మే నిలిచింది. ఈ సారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో!

ప‌చ్చ బ్యాచ్  ఇలా దొరికేసింది