భారీ రోడ్డు ప్రమాదం.. నటి కుష్బూ సేఫ్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ భారీ ప్రమాదం నుంచి కుష్బూ తృటిలో తప్పించుకున్నారు. తమిళనాడులోని మేల్ మరువత్తూర్ సమీపంలో కుష్బూ ప్రయాణిస్తున్న కారుకు, ఓ ట్యాంకర్…

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ భారీ ప్రమాదం నుంచి కుష్బూ తృటిలో తప్పించుకున్నారు. తమిళనాడులోని మేల్ మరువత్తూర్ సమీపంలో కుష్బూ ప్రయాణిస్తున్న కారుకు, ఓ ట్యాంకర్ అడ్డంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పక్క భాగం నుజ్జునుజ్జయింది.

తనకు ప్రమాదం జరిగిన విషయాన్ని కుష్బూ ప్రకటించారు. ఈ రోడ్డు ప్రమాదం నుంచి తను తృటిలో తప్పించుకున్నానని తెలుపుతూ.. ప్రమాదానికి సంబంధించి ఫొటోల్ని ఆమె షేర్ చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె కడలూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అందరి అభిమానం, దేవుని ఆశీస్సులతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపిన కుష్బూ.. ఈ కేసును పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తారని తెలిపారు.

కొన్ని రోజుల కిందట ఆమె కాంగ్రెస్ ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ టైమ్ లో ఆమె కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీ కేంద్రంగా ఓ కోటరీ పనిచేస్తోందని, తనలాంటి చాలామందిని ఎదగనీయకుండా వాళ్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలో ఆమెకు పలు బెదిరింపులు కూడా వచ్చాయి. రేప్ చేస్తామంటూ అప్పట్లో ఓ అగంతకుడు కుష్బూకు ఫోన్ చేసి బెదిరించాడు కూడా. అప్పట్లో కుష్బూపై నమోదైన 30కి పైగా కేసులు, బెదిరింపులకు.. తాజాగా జరిగిన యాక్సిడెంట్ కు లింక్ ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు.

విజన్ 2020 అంటే అర్థం చేసుకోలేకపోయాం