బీజేపీ వర్సెస్ శివసేన.. మాటల యుద్ధం మొదలు!

'తండ్రి జైల్లో ఉన్న నేతలు ఎవరూ లేరిక్కడ..'  అంటూ పరోక్షంగా దుష్యంత్ చౌతాలా-బీజేపీ పొత్తును దెప్పి పొడుస్తూ శివసేన వ్యంగ్యంగా స్పందించి. 'ప్లాన్ ఏ, ప్లాన్ బీ అంటూ ఏమీలేవు. ఉన్నది ఒకటే ప్లాను.…

'తండ్రి జైల్లో ఉన్న నేతలు ఎవరూ లేరిక్కడ..'  అంటూ పరోక్షంగా దుష్యంత్ చౌతాలా-బీజేపీ పొత్తును దెప్పి పొడుస్తూ శివసేన వ్యంగ్యంగా స్పందించి. 'ప్లాన్ ఏ, ప్లాన్ బీ అంటూ ఏమీలేవు. ఉన్నది ఒకటే ప్లాను. అదే వర్కవుట్ కావాలి. కాబోయే ముఖ్యమంత్రి నేనే..' అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ తేల్ఏచశారు. ఇలా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేనల మధ్యన మాటల యుద్ధం మొదలైంది.

ఈ ఇద్దరూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేవు. ఎన్నికల్లో కలిసి పోటీచేసిన ఈ రెండు పార్టీలూ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం విషయంలో పోటీలు పడుతున్నాయి. ఐదేళ్లూ తమకే ముఖ్యమంత్రి పదవి అని భారతీయ జనతా పార్టీ తేల్చి చెబుతూ ఉంది.ఇప్పటి వరకూ ఆ పార్టీ అధినాయకత్వం స్పందించకపోయినా.. ఫడ్నవీస్ స్పందించడం ద్వారా తమ ఉద్దేశాన్ని చెప్పేశారు.

తనే ముఖ్యమంత్రి అని ఆయన ప్రకటించుకున్నారు. భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు శివసేన వినాలన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఇక శివసేన కూడా ఘాటుగానే స్పందిస్తోంది. బెదిరించి తమ మద్దతు పొందలేరని తేల్చిచెబుతూ ఉంది. హర్యానాలో దుష్యంత్ చౌతాలా బీజేపీకి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

దుష్యంత్ కుటుంబీకులంతా జైళ్లలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆయన మద్దతును పొందగలిగింది అన్నట్టుగా సేన స్పందించింది. దుష్యంత్ కు డిప్యూటీ సీఎం హోదాను ఇచ్చింది బీజేపీ. అయితే శివసేనకు మాత్రం సంప్రదింపులే లేవని అంటోంది, సేన డిమాండ్లను పక్కన పెట్టాలన్నట్టుగా బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరి దాయాదుల్లాంటి వారి సమరం ఎంతవరకూ వెళ్తుందో!

వేధింపులా? కర్తవ్యనిర్వహణా?