పది రోజుల క్రితం గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బోంగా ఉమా, బుద్ధా వెంకన్నలపై భౌతిక దాడి జరిగింది. ఆ దాడిలో వాళ్లిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఆ తర్వాత వారు విజయవాడ వచ్చారు. సహజంగానే దూకుడుగా మాట్లాడే బోండా ఉమా…తనపై దాడి ఘటనపై తీవ్రంగా స్పందించాడు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు సీఎం జగన్‌పై బోండా ఉమా రెచ్చిపోయి మాట్లాడాడు. అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ‘మీ ఊరికొస్తా, మీ ఇంటికొస్తా. ఏం పీక్కుంటావో పీక్కో. రేయ్ మీ అంతు చూస్తా’ అని బోండా ఉమా విచక్షణ మరిచి హెచ్చరించిన విషయం తెలిసిందే. బోండాకు మాచర్ల ఎమ్మెల్యే కూడా దీటుగా జవాబిచ్చాడు.
నిజంగానే బోండా ఉమా మళ్లీ మాచర్లకు వెళుతాడేమో, తొడకొట్టి స్థానిక ఎమ్మెల్యేని పిలుస్తాడేమో అని అందరూ భావించారు. కానీ పది రోజులవుతున్నా అలాంటివేవీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తాజాగా మాచర్ల ఘటనపై విచారణ నిమిత్తం అక్కడి పోలీసులు టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్ధా వెంకన్నకు నోటీసులు పంపారు. విచారణకు రావాలనేది ఆ నోటీసుల సారాంశం. ఈ నోటీసులపై టీడీపీ నేతల స్పందన భలే విచిత్రంగా ఉంది.
‘పకడ్బందీ ప్రణాళికతో మాచర్లలో మమ్మల్ని హత్య చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నించారు. ఎలాగోలా తప్పించుకున్నాం. మళ్లీ అదే ప్రదేశానికి రావాలని పోలీసులు నోటీసులు పంపుతున్నారు. మళ్లీ దాడిచేసి హత్య చేయడానికే రమ్మంటున్నారని అనిపిస్తోంది. మాకు మాచర్ల పోలీసులపై నమ్మకం లేదు. మేం అక్కడకు వెళ్లే సమస్యే లేదు’ అని టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తేల్చిచెప్పారు.
మరి ఈ సంబడానికి ఎందుకయ్యా అన్నేసి ప్రగల్భాలు పలికేది. ఏం మాట్లాడినా చూపే మీడియా ఉంది కదా అని…పెద్దాచిన్నా అనే విచక్షణ లేకుండా ముఖ్యమంత్రిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా? మాచర్లకు వస్తా, నీ అంతు చూస్తా అని హెచ్చరించిన బోండా ఉమా….తీరా పోలీసులు రావయ్యా…ఏం జరిగిందో చెప్పయ్యా అని ఆహ్వానిస్తే మాత్రం….నేను రానంటే రాను బాబోయ్ అని వెనక్కి పరుగులు తీయడం దేనికి సంకేతం? అందుకే శక్తికి మించిన మాటలు మాట్లాడటం ఆరోగ్యానికి హానికరమని బోండా ఉమా ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది.
ద్యేవుడా…బట్టల్లేకుండా కనిపించడం స్టార్ హీరోయిన్‌కు సరదా అట!