యాంకర్ రష్మి….బుల్లి తెరపైన మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా మాటకు మాట బదులివ్వడంలో దిట్టే. తాజాగా ఆమె వస్త్రధారణ నెటిజన్‌తో తంటా తీసుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే రష్మి ఇగోను హర్ట్ చేసింది. దీంతో ఆ నెటిజన్‌పై ఓ రేంజ్‌లో ఆ యాంకరమ్మ ఫైర్ అయ్యింది. కరోనా వైరస్‌పై రష్మి ఓ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెట్టారు.
వీరిలో ఓ నెటిజన్ మాత్రం రష్మీని పర్సనల్‌గా కామెంట్ చేశాడు. రష్మి యాంకర్‌గా వ్యవహరిస్తున్న షోతో పాటు ఆమె వస్త్రధారణపై అభ్యంతరకర కామెంట్ చేశాడు. దీంతో రష్మికి చిర్రెత్తుకొచ్చింది. కోపాన్ని ఆమె ఆపుకోలేకపోయింది. ఆ నెటిజన్‌పై తీవ్రస్థాయిలో రష్మి విరుచుకుపడింది.
‘మేం మీ చేతులు, కాళ్లు కట్టేసి టీవీ ముందు కూర్చోపెట్టలేదు. మీకు నచ్చనట్టు మేము డ్యాన్స్ ప్రదర్శన ఇస్తుంటే చూడకుండా కళ్లు మూసుకోండి. లేదంటే చేతిలో రిమోట్‌తో చానల్ మార్చుకోండి. షోతో సమస్యలున్న వాళ్లు చూడకుండా ఉండొచ్చు. లేకపోతే మీరు ఏమైనా సినిమా తీస్తుంటే , అందులో నాకు సతీ సావిత్రి పాత్ర ఇవ్వండి. అంతేగానీ, నేను ఎంచుకున్న పని గురించి నన్ను ప్రశ్నించొద్దు. నాకు వచ్చిన అవకాశాల్లో ఉత్తమమైన వాటిని ఎంచుకుని మీ అందరిలాగే పనిచేస్తున్నా’ అని ఘాటుగా సమాధానమిచ్చింది.
ద్యేవుడా…బట్టల్లేకుండా కనిపించడం స్టార్ హీరోయిన్‌కు సరదా అట!