చంద్రబాబు పాలనలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ ఓ వెలుగు వెలిగాడు. ప్రత్యర్థులతో పాటు అధికారులపై ఆయన సాగించిన దాదాగిరిని టీవీల్లో జనం ప్రత్యక్షంగా వీక్షించి అవాక్కయ్యారు.
తోటి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా … అది కూడా సాక్ష్యాత్తు చట్టసభలో “రేయ్, పాతేస్తా” అని చేయి చూపుతూ హెచ్చరించిన ఘనత బొండా ఉమాకు దక్కుతుంది. అలాగే రవాణాశాఖ ఉన్నతాధికారిని నడిరోడ్డుపై ఎలా బెదిరించారో అందరికీ తెలిసిందే. అలాంటి బొండా ఉమ ఇప్పుడు ప్రవచనకర్తలాగా ధర్మోపన్యాసాలు ఇస్తుంటాడు.
ఇదిలా ఉంటే బొండా ఉమపై సోషల్ మీడియాలో ఓ అంశం విషయమై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఓ ప్రముఖ హోటల్ నుంచి హీరోయిన్‌తో కలిసి ఉమ బయటకు వస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ పోస్టింగ్ తెగ వైరల్ అవుతోంది.
దీంతో ఉమ తనకే మాత్రం సంబంధం లేదని, తనపై ప్రత్యర్థులు అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రత్యర్థులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు.
సోషల్ మీడియాలో హీరోయిన్‌తో కలిసి ప్రముఖ హోటల్ నుంచి బయటికి వస్తున్నట్టు ప్రచారంలో ఉన్న పోస్టింగ్ వల్ల తనపై అనవసర అనుమానాలకు తావిస్తుందని ఆయన పేర్కొన్నాడు.
అసలు ఆ హీరోయిన్ ఎవరో కూడా తనకు తెలియదని, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని బొండా ఉమా పేర్కొన్నాడు. బొండా ఉమా ఫిర్యాదు చేసేలోపే … సదరు పోస్టింగ్ మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచమంతా చక్కర్లు కొట్టింది. అయ్యో ఉమా…ఇలాంటి మీకే కాదు, ప్రత్యర్థుల విషయంలో కూడా జరగొద్దని కోరుకుందాం.