బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ ఇప్పటికే కరోనా పాజిటివ్ గా తేలారు. బ్రిటన్ లో ఇప్పటికే 10 వేల కి పైగా కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. ఈ క్రమంలో ఆ సంఖ్య మరింత పెరుగుతూ ఉంది. స్వయంగా రాజకుటుంబ ప్రముఖుడికే కరోనా పాజిటివ్ అని ఇప్పటికే తేలింది. అప్పటికే ప్రిన్స్ చార్లెస్ తల్లి, రాణి ఎలిజబెత్ విషయంలో ముందుగానే అతి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆమెను ఏకాంతవాసానికి తరలించారు. రాణి అలా సేఫ్ జోన్ లో నిలిచినా, ఆమె తనయుడికి కరోనా సోకినట్టుంది.
ఇక రాజుగారినే తాకిన కరోనా ఆ దేశంలో మంత్రిగారిని కూడా వదిలినట్టుగా లేదు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలిందట. ఇలా యువరాజు-మంత్రి ఇద్దరూ కరోనా బాధితులు అయ్యారు. ఇలా కీలక హోదాల్లోని వారే కరోనా బాధితులు కావడంతో బ్రిటన్లో మరింత భయభ్రాంతులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. జాన్సన్ ను ఇప్పటికే ఐసొలేషన్ కు షిఫ్ట్ చేసినట్టుగా బ్రిటన్ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.
యూరప్ లో ఇటలీ, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ కరోనాతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాయి. గురువారం ఒక్కరోజు బ్రిటన్లో కరోనా ప్రభావంతో వంద మందిక పైగా చనిపోయినట్టుగా అక్కడి మీడియా సంస్థలు ప్రకటించాయి. ఇప్పటి వరకూ అక్కడ 678 మంది కరోనా వల్ల చనిపోయారని పేర్కొన్నాయి.