వాళ్ళే ఇపుడు అంటరానివాళ్ళు!

ఒకపుడు వాళ్ళు ఊళ్ళోకొస్తే గొప్ప. వారు బడా బాబులు. మోతుబరులు, ఆసాములు, ఇంకా చెప్పాలంటే అమెరికా పెద్దన్నతో సమానంగా అగ్ర తాంబూలం అందుకున్న వాళ్ళు. మరి ఇపుడో సీన్ రివర్స్ అయింది వారు వస్తున్నారంటే…

ఒకపుడు వాళ్ళు ఊళ్ళోకొస్తే గొప్ప. వారు బడా బాబులు. మోతుబరులు, ఆసాములు, ఇంకా చెప్పాలంటే అమెరికా పెద్దన్నతో సమానంగా అగ్ర తాంబూలం అందుకున్న వాళ్ళు. మరి ఇపుడో సీన్ రివర్స్ అయింది వారు వస్తున్నారంటే అమ్మ బాబోయ్ అంటున్నారు. ఇంకా చెప్పాలంటే వణికిపోతున్నారు.

వారే విదేశీయులు. అంటే అచ్చమైన విదేశీయులు కారు. విదేశాల్లో ఉంటూ స్వదేశానికి వచ్చిన మన అచ్చమైన పౌరులే. కరోనా వ్యాది వాహకాలుగా వారిని ఇపుడు జనం చూస్తున్నారు. అంటే ఓ విధంగా వారిని అరవీర భయంకరమైన శత్రువులుగా చూస్తున్నారు.

ఇక వారి విషయంలో ప్రభుత్వాలు కూడా ఓ కంట కనిపెట్టడంతో ప్రవాసాంధ్రుల ప్రరిస్థితి ఇబ్బందిగా మారిందనే చెప్పాలి. విశాఖ లాంటి  మహానగరంలో వీరి వేలల్లో ఉన్నారు. వారి డేటా కూడా ఇపుడు ప్రభుత్వం  దగ్గర పక్కాగా  ఉంది.

దాంతో కరోనా  వైరస్ నియంత్రణ నేపధ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్ళకు ఎవరూ పోవద్దంటూ విశాఖలో అధికారులు  కట్టడి విధిస్తున్నారు.  వారి ఇంటి ముందు నోటీసులు కూడా అంటిస్తున్నారు.

వీరి వద్దకు ఎవరూ రావద్దు,  ఇటువైపుగా రాకపోకలు నిషిధ్ధమంటూ నోటీసులు పెట్టడమే కాకుండా సమీపంలో ఎవరినీ రానీయకుండా నియంత్రణ విధించడంతో విదేశాల నుంచి వచ్చిన వారు ఒక విధంగా ఐసొలేట్ అయినట్లు అయింది.

ఇదంతా కరోనా కట్టడిలో భాగంగా ఉన్నా విదేశీ ముద్ర ఉన్న వారికి ఇబ్బందిగానే ఉంది. ఏది ఏమైనా కరోనాపై యుధ్ధంలో ఇలాంటివి తప్పదంతే.

బన్నీ ఎంత ఇచ్చాడో తెలుసా

నిరుపేద కళాకారులకు నిత్యావసరాలు సరఫరా చేసిన రాజశేఖర్