బాలయ్య వియ్యంకుడికి కలిగిన లబ్ధి అది!

బాలకృష్ణ వియ్యంకుడు, నారాలోకేష్ తోడల్లుడు తండ్రి రామారావుకు ఏపీ ప్రభుత్వం నుంచి 493 ఎకరాల లబ్ధి చేకూరిందని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన వైనంలో…

బాలకృష్ణ వియ్యంకుడు, నారాలోకేష్ తోడల్లుడు తండ్రి రామారావుకు ఏపీ ప్రభుత్వం నుంచి 493 ఎకరాల లబ్ధి చేకూరిందని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన వైనంలో అది కూడా ఒకటి అని బొత్స అన్నారు. రాజధాని ప్రాంతం అది అని అధికారికంగా ప్రకటించక మునుపే అక్కడ రామారావుకు భారీగా భూ కేటాయింపులు జరిగాయని బొత్స పేర్కొన్నారు.

'493 ఎకరాల భూమిని ఎకరానికి లక్ష రూపాయలకే కేటాయించారు. ఏపీఐఐసీ ద్వారా అంత కారు చౌకగా ఆ భూమిని కేటాయించారు. ఆ తర్వాత అదే భూమిని సీఆర్డీఏ పరిధిలోకి తీసుకువచ్చారు..' అని బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని ఆ ప్రాంతంలో వస్తుందని అధికారికంగా ప్రకటించక మునుపే బాలయ్య వియ్యంకుడికి ఆ మేరకు లబ్ధి కలిగించారు. ఆ తర్వాత అదే ప్రాంతంలో రాజధానిని ప్రకటించారు. అదంతా సీఆర్డీఏ పరిధిలోకి వచ్చేలా చూశారు. 'ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా?' అని బొత్స ప్రశ్నించారు.

ఇది కేవలం ఒక్క ఉందంతం మాత్రమే అని, అనేకమంది తెలుగుదేశం నేతలు అలా లబ్ధిపొందారని బొత్స వ్యాఖ్యానించారు. సుజనా చౌదరి కూడా అదే విధంగా భూములు కొనుగోలు చేశారని, తెలుగుదేశం నేతలంతా అలా ముందస్తుగా భూములు చౌక ధరలకు కొనుగోలు చేసిన తర్వాతే రాజధాని అక్కడ అనే ప్రకటన వచ్చిందని, ఇదంతా స్కామ్ కాదా అన్నట్టుగా బొత్స ప్రశ్నించారు. 

అమరావతిలో భూములు కొన్న నేతల హడల్!