సైరా బేరానికి దిల్ రాజు అడ్డం

సాహో ఫీవర్ అలా వుండగానే, సైరా ఫీవర్ స్టార్ట్ అయింది. ఈ సినిమా హక్కుల కోసం పోటీ మొదలయింది. ఉత్తరాంధ్ర సైరా పంపిణీ హక్కుల కోసం సీనియర్ ఎగ్జిబిటర్ క్రాంతిరెడ్డి 14.5 కోట్ల ఎన్ఆర్ఎ…

సాహో ఫీవర్ అలా వుండగానే, సైరా ఫీవర్ స్టార్ట్ అయింది. ఈ సినిమా హక్కుల కోసం పోటీ మొదలయింది. ఉత్తరాంధ్ర సైరా పంపిణీ హక్కుల కోసం సీనియర్ ఎగ్జిబిటర్ క్రాంతిరెడ్డి 14.5 కోట్ల ఎన్ఆర్ఎ కింద దాదాపు ఓకే చేయించుకున్నారు. ఆయనకు మెగాస్టార్ తో తొలిరోజుల నుంచి అనుబంధం వుంది. మరో డిస్ట్రిబ్యూటర్ గాయత్రి ఫిలింస్ 13.5కోట్ల వరకు వెళ్లి ఆగిపోయారు.

ఇదిలావుంటే క్రాంతిరెడ్డికి హక్కులు దాదాపు ఇచ్చేసారు అనే టైమ్ లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అడ్డంపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పెద్ద ప్లేయర్ గా వున్నారు దిల్ రాజు. ఆయన 15 కోట్లకు పైగా ఆఫర్ చేసి, తనకు హక్కులు ఇవ్వాలని కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

దాంతో క్రాంతిరెడ్డి విషయం తాత్కాలింగా నిలిపినట్లు తెలుస్తోంది. అవసరం అయితే 16కోట్లు ఇచ్చి అయినా సైరాను ఉత్తరాంధ్రలో తానే పంపిణీ చేయాలనే ఆలోచనలో దిల్ రాజు పట్టుదలగా వున్నారన్నది డిస్ట్రిబ్యూషన్ సర్కిళ్లలో వినిపిస్తోంది.

సైరాను ఇఫ్పటికే నైజాం 30 కోట్లకు దిల్ రాజు-యువి కలిపి తీసుకున్నారు. ఇదికాక మరో రెండుకోట్లు అదనంగా రిటర్న్ బుల్ అడ్వాన్స్ గా ఇస్తున్నారు. వెస్ట్ గోదావరికి ఉషా బాలకృష్ణ సంస్థ 9 కోట్లకు తీసుకున్నారు. సీడెడ్ ను ఎన్వీ ప్రసాద్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 20 కోట్ల ఎన్ఆర్ఎ, రెండు కోట్లు రిటర్న్ రేంజ్ లో ఆయన తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మిగిలిన ఏరియాలు బేరాలు జరుగుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావు, రామ్ చరణ్ మేనేజర్ ప్రవీణ్ ఈ విషయాలు అన్నీ చూస్తున్నారు. అన్ని ఏరియాలు ఎన్ఆర్ఏ తప్ప, ఔట్ రేట్ గా ఇవ్వడంలేదు.

అమరావతిలో భూములు కొన్న నేతల హడల్!