ఇది బీజేపీ క్యాబినెట్ కాదు, బాక్సాఫీస్ క్యాబినెట్..!

“పాత హిట్ సినిమాలన్నిటినీ తిరిగి థియేటర్లలో రిలీజ్ చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. భారత ఆర్థిక పరిస్థితి చక్కబడాలంటే ఇదే సరైన చర్య”. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినపడుతున్న కామెంట్లివి. బాక్సాఫీస్ క్యాబినెట్ అంటూ…

“పాత హిట్ సినిమాలన్నిటినీ తిరిగి థియేటర్లలో రిలీజ్ చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. భారత ఆర్థిక పరిస్థితి చక్కబడాలంటే ఇదే సరైన చర్య”. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినపడుతున్న కామెంట్లివి. బాక్సాఫీస్ క్యాబినెట్ అంటూ హ్యాష్ ట్యాగ్ జతచేసి మరీ కేంద్రంలో బీజేపీ సర్కార్ ని ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు. బారత ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉంది, దీనికి బీజేపీ ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టి ఈ వివాదానికి కారణమయ్యారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్.

విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ.. దేశ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని, కావాలంటే అక్టోబర్ 2న విడుదలైన మూడు బాలీవుడ్ సినిమాల కలెక్షన్లు చూసుకోండి, ఒక్కొకటి 120 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. ఇంతకంటే ఇంకేం ఉదాహరణ కావాలంటూ రవిశంకర్ ప్రసాద్ నోరు జారారు. అంతే గంటల వ్యవధిలోనే ఈ కామెంట్లు వైరల్ అయ్యాయి. బాలీవుడ్ సినిమాల కలెక్షన్లు బాగుంటే చాలు, దేశం బాగున్నట్టేనంటూ సాక్షాత్తూ కేంద్ర మంత్రే మాట్లాడారని ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి.

సోషల్ మీడియా పుణ్యమా అని రవిశంకర్ ప్రసాద్ పరువు బజారున పడింది. అధిష్టానం కూడా తలంటే సరికి అంతే స్పీడ్ గా ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. వెంటనే మరో ప్రెస్ మీట్ పెట్టి నా అభిప్రాయం అదికాదు, నా మాటల్ని వక్రీకరించారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అయితే ముందు జాగ్రత్తగా మరో అడుగు ముందుకేసి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు రవిశంకర్ ప్రసాద్. నేను సున్నిత మనస్కుడిని కాబట్టి, ఇలాంటి వివాదాలు నన్ను నొప్పించాయి. అందుకనే నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు.

అయితే అప్పటికే నెట్టింట్లో నెటిజన్లు రవిశంకర్ ప్రసాద్ నీ, బీజేపీ సర్కార్ నీ ఓ ఆటాడేసుకున్నారు. బాక్సాఫీస్ క్యాబినెట్ అంటూ ఓ రౌండ్ వేసుకున్నారు. చాలా చాకచక్యంగా మాట్లాడే రవిశంకర్ ప్రసాద్, ఈసారి మాత్రం ప్రతిపక్షాలకు ఇలా అడ్డంగా దొరికిపోయారు.

జ్ఞానం రాత్రికి రాత్రి రాదు.. విద్యార్జన నిరంతర ప్రక్రియ