ఓవర్సీస్ మార్కెట్ ఇటీవలి కాలంలో బాగా పడిపోయింది. మునుపటిలా ఆఫర్లు లేకపోవడం, సినిమా టాక్ ఏమాత్రం తేడాగా వచ్చినా కానీ ప్రేక్షకులు థియేటర్లకి కదలి రాకపోవడం జరుగుతోంది. సాహో, సైరా లాంటి చిత్రాలకి కూడా ఆశించిన వసూళ్లు రాకపోవడంతో పెద్ద సినిమాలకి కూడా బయ్యర్లు దొరకని పరిస్థితి వచ్చేసింది.
ఈ నేపథ్యంలో సంక్రాంతికి రాబోతోన్న భారీ చిత్రాలు ఓవర్సీస్ మార్కెట్ సంగతి ఏమిటనేది డిసైడ్ చేస్తాయి.ఓవర్సీస్‌లో ఎప్పట్నుంచో తిరుగులేదనిపించుకున్న మహేష్ ఇటీవల మహర్షితో తన మ్యాజిక్ చేయలేకపోయాడు.
సరిలేరు నీకెవ్వరు అయితే అనిల్ రావిపూడి ఫ్యాక్టర్ కూడా జత కలిసి అదరగొడుతుందనే అంచనాలు వేస్తున్నారు. ఈ సినిమాతో ఓవర్సీస్ మార్కెట్ ప్రస్తుత పొజిషన్ ఏమిటనేది తెలుస్తుంది.
అలాగే దర్శకులలో ఓవర్సీస్ మార్కెట్‌లో తిరుగులేని బ్రాండ్ వున్న డైరెక్టర్ త్రివిక్రమ్. అల వైకుంఠపురములో చిత్రం అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టే వుంటుందని అనిపిస్తోంది. ఇప్పటికే పాటలు బాగా పాపులర్ అవడం ఈ చిత్రానికి కలిసి వస్తుంది. ఈ చిత్రంతో త్రివిక్రమ్ మరోసారి తన కమాండ్ చూపిస్తే డల్ అయిపోయిన ఓవర్సీస్ మార్కెట్‌లో మళ్లీ ఉత్సాహం ఉరకలేస్తుంది.
మహేష్, అల్లు అర్జున్ చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవుతుండడంతో 'వెంకీ మామ'ని ఆ టైమ్‌లో రిలీజ్ చేయడం కరక్ట్ కాదని సురేష్ బాబు కూడా సంకోచించారు. అందుకే సెలవులు లేకపోయినా కానీ 'వెంకీ మామ' డిసెంబర్ 13న రిలీజ్ చేసారు. పెద్ద నిర్మాతలు, చేతిలో చాలా థియేటర్లు వున్న వాళ్లే సంక్రాంతి బరిలోకి వెళ్లడానికి, 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో'తో పోటీ పడడానికి జంకితే 'ఎంత మంచివాడవురా' నిర్మాతలు మాత్రం సంక్రాంతి నుంచి పక్కకి తప్పుకోమని చెబుతున్నారు.
'శతమానం భవతి' దర్శకుడు సతీష్ వేగేశ్న అప్పుడు తన చిత్రం రెండు భారీ చిత్రాలకి పోటీగా వచ్చి సక్సెస్ అయింది కనుక ఈసారి కూడా అదే అవుతుందని నమ్మకంగా వున్నాడు. అయితే ఆ చిత్రానికి వున్న దిల్ రాజు ఫ్యాక్టర్ ఈసారి లేదు కాబట్టి దీనికి ఎన్ని థియేటర్లు దొరుకుతాయనేది తెలీదు.
మహేష్, అల్లు అర్జున్ సినిమాలతో పాటు రజనీకాంత్ దర్బార్ కూడా వుంది కనుక కళ్యాణ్‌రామ్ సినిమా కోసం థియేటర్లు ఖాళీ చేసే పరిస్థితి వుండదు.ఎలా చూసినా చాలా పెద్ద రిస్క్ అనిపిస్తున్నా కానీ 'ఎంత మంచివాడవురా' చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయాలని నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా ఫిక్స్ అయిపోయాడు.
సంక్రాంతికి రివాజుగా వచ్చే తన బాబాయ్ చిత్రం కూడా ఈసారి డిసెంబర్‌కి షిఫ్ట్ అయినా కానీ కళ్యాణ్‌రామ్ మాత్రం ఈ చిత్రం విషయంలో ధీమాగానే కనిపిస్తున్నాడు