దివాకర్ వి మరిన్ని బస్సులు సీజ్!

తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్ బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్నేళ్లూ ఏదో రకంగా అధికార పార్టీలో ఉంటూ దివాకర్ రెడ్డి అక్రమంగా బస్సులను తిప్పారనే…

తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్ బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్నేళ్లూ ఏదో రకంగా అధికార పార్టీలో ఉంటూ దివాకర్ రెడ్డి అక్రమంగా బస్సులను తిప్పారనే ఖ్యాతిని గాంచారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అయినా, టీడీపీ పవర్ లోకి వచ్చాకా అయినా దివాకర్ ట్రావెల్ దందాకు తిరుగులేకుండా పోయింది.

ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకున్నా.. దివాకర్ బస్సులపై తనిఖీలు లేవు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. పర్మిట్లు లేకుండా బస్సులను తిప్పుతూ అటు ప్రభుత్వానికి నష్టం చేకూర్చడంతో పాటు, ఇటు ప్రయాణికుల భద్రతను కూడా ప్రశ్నార్థకం చేస్తున్న వైనం పై సీజ్ మొదలైంది. ముందుగా ఇరవై మూడు బస్సులను అధికారులు  సీజ్ చేశారు.

తాజాగా మరో ఎనిమిది బస్సులను కూడా కట్టడి చేశారు. ఇవన్నీ సరైన పర్మిట్లు లేకుండా, అక్రమంగా నడుస్తున్న బస్సులని రవాణాశాఖ అధికారులు ధ్రువీకరించారు. బోలెడన్ని లొసుగులతో ఇవి నడుస్తున్నాయని నిర్ధారించారు. ఇన్నాళ్లూ అధికార పార్టీ నేత కాబట్టి.. అధికారులు చర్యలకు సాహసించలేదని తెలుస్తోంది.

గతంలో ఆర్టీఏ ఆఫీసుల్లోకి వెళ్లి మరీ తమ బస్సులను సీజ్ చేసిన అధికారులపై జేసీ సోదరులు విరుచుకుపడేవాళ్లు. ఇప్పుడు తమ అక్రమ బస్సులపై ఆర్టీఏ కొరడా ఝలిపిస్తున్నా కామ్ గా ఉన్నారు.

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్