తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేసిన నల్లచొక్కాల దీక్షకు అయిన మొత్తం అక్షరాలా నాలుగు కోట్ల రూపాయలు! అందుకు సంబంధించిన నిధులను ప్రభుత్వ ఖజానా నుంచి కాదు, ఏకంగా టీటీడీ ఖాతా నుంచి తీశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికల ముందు రకరకాల దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. వారానికో దీక్షలు చేశారు. అవన్నీ దొంగ దీక్షలనే విమర్శలు తీవ్రంగా వచ్చాయి.
అయినా చంద్రబాబు నాయుడు తగ్గలేదు. వాటితో పొలిటికల్ మైలేజ్ వస్తుందని చంద్రబాబు భ్రమపడటం ఒక ఎత్తు అయితే, ఆ దీక్షలతో తన పార్టీ వారి దోపిడీకి కూడా అవకాశం ఉండటం మరో రీజన్ అంటారు. ఆ దీక్షలకు ఏర్పాట్లన్నీ ప్రభుత్వ సొమ్ములతోనే చేస్తారు. ఏర్పాట్లన్నీ టీడీపీ అనుకూల కాంట్రాక్టర్లు చేస్తారు. అయ్యే ఖర్చు పది రూపాయలు అయితే రాసే ఖర్చు వందల రూపాయల్లో ఉంటుంది. దీంతో వారి దోపిడీ కూడా నిరాకంటంగా సాగుతుంది.
ఇక ఢిల్లీ దీక్షలో తెలుగుదేశం శ్రేణుల భోజనాలకు, బసుకు, టీలకు, టిఫిన్లకు అయిన ఖర్చు నాలుగు కోట్ల రూపాయలట! ప్రభుత్వ ఖజానా అప్పటికే ఖాళీ అయిపోవడంతో.. ఆఖరికి టీటీడీ నిధులను కూడా చంద్రబాబు దీక్షలకు వాడేశారని సమాచారం. 'మళ్లీ సర్దుబాటు..' అనే మాటతో దేవదేవుడి నిధులను చంద్రబాబు నాయుడు తన ప్రచార ఆర్భాటానికి వాడినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై జగన్ ప్రభుత్వం విచారణ చేయిస్తోంది.
ఢిల్లీలోని టీటీడీ ఆధ్వర్యంలోని వెంకటేశ్వరుడి ఆలయం ఖాతా నుంచి నాలుగు కోట్లు వాడుకున్నారని, వాటితో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అక్కడ పార్టీలు ఇచ్చి… చంద్రబాబు నాయుడి దీక్ష దగ్గర కూర్చోబెట్టారని విజిలెన్స్ కమిటీ తేల్చిందట. మొత్తానికి చంద్రబాబు దీక్షా డ్రామాలకు దేవుడి నిధులను కూడా నొక్కారని తెలుస్తోందట. ఇదీ కథ!