బుధ్ధం శరణం గత్యామీ…అడ్డుకోవడానికి అడ్డదారులు…?

జగన్ నోటి వెంట మాట వస్తే చాలు అడ్డుకోవడానికి తయారుగా ఉంటున్న విపక్షం ఏపీలో ఉంది. ఇళ్ల స్థలాలు పేదలకు పంపిణీ చేస్తమని జగన్ అంటే వద్దు అని కోర్టులకు వెళ్తారు, ఇంగ్లీష్ మీడియం…

జగన్ నోటి వెంట మాట వస్తే చాలు అడ్డుకోవడానికి తయారుగా ఉంటున్న విపక్షం ఏపీలో ఉంది. ఇళ్ల స్థలాలు పేదలకు పంపిణీ చేస్తమని జగన్ అంటే వద్దు అని కోర్టులకు వెళ్తారు, ఇంగ్లీష్ మీడియం మీద కూడా పడి ఏడుస్తారు. మూడు రాజధానుల పేరిట అధికార, అభివ్రుధ్ది వికేంద్రీకరణ చేస్తామంటే దాని మీదా యాగీ చేస్తారు.

ఇపుడు ఈ ఏడుపు ఎందాక వచ్చిందంటే విశాఖలో కూడా కొత్త ఇటుక ఒక్కటీ కూడా వేయకూడదన్న పంతంతో ఏకంగా బుద్ధుణ్ని మధ్యకు తెస్తున్నారు. జగన్ సర్కార్ విశాఖలోని కాపులుప్పాడలో సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిధ్ధం చేస్తోంది.

ఇపుడు అందులో భాగంగా స్టేట్ గెస్ట్ హౌస్ 30 ఎకరాల్లో నిర్మించాలని ప్రతిపాదించింది. దానికి సంబంధించిన కార్యాచరణ ఇలా రెడీ అయిందో లేదో అలా అడ్డంకులు మొదలయ్యాయి. కాపులుప్పాడ హిల్స్ మీద ఈ నిర్మాణాలు తలపెడుతూంటే తొట్ల కొండను మధ్యలోకి తీసుకువస్తున్నారు. అక్కడ ఉన్న బుద్ధుల మాన్యుమెంట్స్ దెబ్బతింటాయని, అందువల్ల సమీపంలో ఎటువంటి నిర్మాణాలు వద్దంటూ అపుడే డిమాండ్లు మొదలయ్యాయి.

నిజానికి చెప్పాలంటే అలూ లేదు, చూలూ లేదు కానీ ఇంతలోనే అంత గోల అన్నట్లుంది సీన్. ఎలాగోలా  డెవలప్మెంట్ ని అడ్డుకోవడానికి సవాలక్ష కారణాలతో తయారవుతున్నారు. లేఖలు  రాస్తున్నారు, రోడ్లపైకి వస్తున్నారు. మరి దీని మీద జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ఆ సినిమా ఎవడూ చూడడని ముందే తెలుసు

ఒక వైపు నుయ్యి మరోవైపు గొయ్యి.. ఈ 'దేశం'కి ఏమైంది