అందరూ ఊహించినట్టుగానే ఏపీ కేబినెట్ మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు వివిధ అంశాలపై ఏడు బిల్లులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకొంది. గంటపాటు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకొంది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ సిఫార్సు చేసినట్టు కొన్నింటి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ ఆమోదించిన అంశాలివే…
-విశాఖకు సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల కేటాయింపునకు నిర్ణయం.
-అమరావతిలో శాసన రాజధాని , కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయం.
-నాలుగు ప్రాంతీయ కమిషనరేట్ల ఏర్పాటు
-రాజధాని రైతులకు కౌలు రూ.2500 నుంచి రూ.5వేలకు పెంపు. అలాగే కౌలును పదేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు చెల్లించాలని నిర్ణయం.
-సీఆర్‌డీఏని అమరావతి మెట్రో పాలిటిన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీగా మార్పు.
-రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై టేబుల్ ఐటమ్‌గా చర్చించడానికి నిర్ణయం. విచారణ బాధ్యతలను లోకాయుక్తకు అప్పగించాలని నిర్ణయం.