ఏపీ సీఎం జగన్ పాలనతో జనసేనాని పవన్‌కల్యాన్ సినిమాకు లింక్ ఉందా అంటే ఉందనే చెప్పాలి. ఎందుకంటే జగన్ మంచి పరిపాలన అందిస్తే ఆనందంగా తాను సినిమాలు తీసుకుంటానని విశాఖలో బహిరంగ సభా వేదికపై నుంచి పవన్‌కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేనాని విశాఖలో లాంగ్‌మార్చ్‌తో పాటు భారీ బహిరంగ నిర్వహించారు.
ఆ సభలో పవన్ ఆవేశంగా మాట్లాడుతూ జగన పాలనపై విమర్శలు గుప్పించాడు. ఇప్పటికైనా జగన్ తన పాలనా విధానాలు మార్చుకోవాలని కోరాడు. ఇదే సందర్భంలో జగన్ మంచి పరిపాలన అందిస్తే తాను ఏం మాట్లాడనని, హాయిగా సినిమాలు తీసుకుంటానని ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ అవుతుండటంపై “జగన్ పాలన బాగుందా పవన్” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్లో అమితాబ్ నటించిన చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ పోషించిన పాత్రలో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నివేదాథామస్, అంజలి, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న “పింక్” రీమేక్ సోమవారం ప్రారంభం కానుంది. పవన్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని కథలో చిన్నచిన్న మార్పులు చేసినట్టు సమాచారం. ఇవన్నీఎలా ఉన్నా గతంలో జగన్ పాలనకు సంబంధించి పవన్ చేసిన కామెంట్స్, ప్రస్తుతం ఆయన రీఎంట్రీపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సినిమాల్లోకి రాను రానంటూనే 20 రోజులు కంటిన్యూగా షూటింగ్‌కు కాల్షీట్స్ ఇచ్చినట్టు సమాచారం. ఏంటో పవన్ చెప్పేదొకటి, చేసేదొకటి.