స్విట్జర్లాండ్ రాజధాని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రత్యేకించి ఈ సదస్సుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక అనుబంధమే ఉంది! గతంలో ఈ సదస్సు జరిగిందంటే చాలు.. చంద్రబాబు నాయుడు స్విస్ కు చేరుకునే వారు. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా.. నారా లోకేష్ కూడా గత ఐదేళ్లలో దావోస్ సదస్సుకు క్యూ కట్టారు.
అక్కడ పాలకూర పప్పు..ప్రపంచ మేధావులకు అపర ప్రపంచ మేధావి చంద్రబాబు సలహాలు, సూచనలు ఇవ్వడం.. ఆ ఇదే వేరు! అయితే సలహాలు ఇవ్వమని ఎవరూ చంద్రబాబు నాయుడును ఆహ్వానించే వాళ్లేమీ కాదు. దావోస్ లో సమావేశానికి భారీ ధర చెల్లించి టికెట్ కొనుక్కోవాలి. అలా చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్ముతో దావోస్ సమావేశానికి టికెట్ కొని, ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానంలో వెళ్లి వచ్చే వారు. లోకేష్ కూడా ముచ్చటపడి దావోస్ సమావేశానికి హాజరయ్యారు. అక్కడ పాలకూర పప్పును దేశదేశాల వాళ్లకూ వడ్డించేందుకు చంద్రబాబు మందీమార్బలం కూడా స్విట్జర్లాండ్ వెళ్లేది.
మరి ఇప్పుడు చంద్రబాబుగారు ప్రతిపక్షంలో ఉన్నారాయె. కాబట్టి దావోస్ కు వెళ్లడం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడుకు ప్రపంచానికి సలహాలు ఇవ్వాలనే ఆసక్తే ఉంటే.. ఇప్పుడు కూడా దావోస్ వెళ్లవచ్చు. టికెట్ కొనుక్కొని వెళ్లొచ్చు. అయితే ఇప్పుడు ప్రజల స్పాన్సర్ షిప్ తో అవకాశం ఉండదు. సొంతడబ్బు పెట్టి.. టికెట్ కొనుక్కొని ఆ సమావేశానికి హాజరు అయ్యే అవకాశం ఉంది. అయితే సొంత డబ్బుతో అలాంటి ఖరీదైన సమావేశానికి హాజరయ్యేందుకు చంద్రబాబు అమాయకుడు ఏమీ కాకపోవచ్చు. అలాంటివన్నీ ప్రజల సొమ్ముతో అలాంటి అవకాశాలు ఉన్నప్పుడే ఆయన ప్రత్యేక విమానాలతో అలాంటి చోట ల్యాండ్ అవుతారేమో!