Advertisement

Advertisement


Home > Movies - Movie News

మిస్ ఇండియా మార్చ్ 6న

మిస్ ఇండియా మార్చ్ 6న

జాతీయ ఉత్తమనటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మిస్ ఇండియా.  ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మహానటి’ లాంటి అద్భుత చిత్రం తర్వాత కీర్తి సురేష్ నటిస్తున్న తెలుగు చిత్రమిదే.  ఇప్పుడు ఈ మిస్ ఇండియా సినిమా విడుదల డేట్ ను ఫిక్స్ చేసారు. మార్చి 6న విడుదలవుతుంది.

మహిళలు, అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఓ మాంచి పాయింట్ తో తయారవుతున్న సినిమా మిస్ ఇండియా. ప్రతి మహిళ లేదా అమ్మాయి తన జీవితంలో ఇలాగే జరిగింది. ఇలాంటి పాయింట్ మన జీవితంలోనూ వుంది అనుకునేలాంటి కథ కుదరడంతో, కీర్తి సురేష్ అయితేనే ఈ సినిమా చేయాలని అనుకున్నామని నిర్మాత మహేష్ కోనేరు తెలిపారు. 

వాస్తవానికి మిస్ ఇండియా సినిమా ఫిబ్రవరి ప్రారంభంలో థియేటర్లకు వస్తుందని అనుకున్నారు.. అయితే ప్రీ సమ్మర్ టైమ్ ను ముందుగా అందుకోవాలనే ఆలోచనతో సినిమాను మార్చి ఫస్ట్ వీక్ లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి రెండు స్ట్రయిట్ సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా అందించిన ఈస్ట్ కోస్ట్ సంస్థకు ఇది నాలుగో సినిమా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?