నూటా యాభై ఒక్క సీట్లు ఇచ్చే సరికి వైఎస్ జగన్ కు అహంకారం పెరిగింది… అంటూ తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్టేట్ మెంట్ ఇచ్చారు. జనం జగన్ మాయలో పడ్డారంటూ చంద్రబాబు నాయుడు అంటున్నారు!
జగన్ పాలనలో ప్రజలు బాగా ఇబ్బంది పడిపోతున్నారంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తూ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, నూటా యాభై సీట్లు ఇచ్చే సరికి జగన్ కు అహంకారం పెరిగిందంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం మాత్రం మరో రకమైన ధ్వనిలా కూడా ఉంది!
జగన్ కు నూటా యాభై ఒక్క సీట్లు ఇవ్వడం ఎక్కువైందని, కాస్త సీట్లు తగ్గించి ఉండాల్సిందన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలో ఒక శ్లేష వినిపిస్తోంది. కొన్ని తక్కువ సీట్లు ఇచ్చి ఉంటే జగన్ కు అహంకారం ఉండేది కాదన్నట్టుగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ధ్వనిస్తూ ఉంది.
అధికారం ఇవ్వడం వరకూ ఓకే కానీ, మరీ అలా నూటా యాభై ఒక్క సీట్లు ఇవ్వడం మాత్రమే తప్పు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు విశ్లేషణ ఉంది.
అయినా ఎన్నికలైపోయిన మూడేళ్లకు, మరో రెండేళ్లలోపే ఎన్నికలు ఉన్నాకా.. ఇప్పుడు గత ఎన్నికల సీట్ల నంబర్లు సంగతులెందుకో! అప్పుడేమో ఈవీఎంల వల్ల జగన్ గెలిచాడంటూ చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టారు. ఇప్పుడేమో జనం జగన్ మాయలో పడ్డారని చెబుతున్నారు!