తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎట్టకేలకూ కాస్త జనం మధ్యకు కదిలారు. తన పార్టీ నేతలను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ ను వీడి గుంటూరుకు వెళ్లి .. ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పాత రికార్డులే వేయడం గమనార్హం.
అన్ని గుర్తుంచుకోబోతున్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తమ పార్టీ నేతలపై కేసులు పెట్టి వారిని అరెస్టులు చేయడం దారుణమన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తమ వారిపై కేసులు పెట్టడంలో ఉన్న నిజానిజాల గురించి మాట్లాడని చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ వాళ్లపై కేసులు పెడితే కోర్టులు చాలవని ప్రకటించేశారు! సాధారణంగా జైళ్లు చాలవు అని ఎవరైనా అంటారు, అయితే చంద్రబాబు నాయుడు కోర్టుల పేరెత్తి బెదిరించడం గమనార్హం!
ధూళిపాళ్లకు ప్రజలంతా అండగా నిలవాలంటూ మరో తన రొటీన్ బేల ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు. తనపైనా, తన వారిపైన కేసులు వచ్చినప్పుడల్లా అండగా నిలబడాలి, అడ్డుగా నిలబడాలి అనే ప్రకటనలు చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు. అదే మరోసారి రిపీటయ్యింది.
ఒక మరో కామెడీ ఏమిటంటే.. తన హయాంలో రాయలసీమలో శాంతిని నెలకొల్పినట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు. రాయలసీమలో తన హయాంలో ప్రశాంతత తీసుకొచ్చారట. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్లు మళ్లీ హత్యారాజకీయాలు మొదలుపెట్టారట. ఇదీ చంద్రబాబు గారి మరో ప్రహసనపు ఉవాచ!