సీబీఎన్…స్టేబీయన్…!

చంద్రబాబు తట్టుకోవాలే కానీ ఇలాంటి పంచ్ లు ఎన్ని అయినా వేసేందుకు నెటిజన్లూ రెడీగా ఉన్నారు. వైసీపీ నేతలూ ఇంకా రెడీగా ఉన్నారు. షార్ట్ కట్ లో చంద్రబాబు పేరు సీబీఎన్. అయితే ఇపుడు…

చంద్రబాబు తట్టుకోవాలే కానీ ఇలాంటి పంచ్ లు ఎన్ని అయినా వేసేందుకు నెటిజన్లూ రెడీగా ఉన్నారు. వైసీపీ నేతలూ ఇంకా రెడీగా ఉన్నారు. షార్ట్ కట్ లో చంద్రబాబు పేరు సీబీఎన్. అయితే ఇపుడు దాన్ని పట్టుకుని  స్టేబీఎన్ గా నెటిజన్లు మార్చేసారుట.

ఈ విషయం చెబుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బాబు మీద గట్టిగానే కౌంటరేశాడు.  అక్కడ జనాలు నీ పేరు మార్చేశారు బాబూ అంటూ ఎకసెక్కమాడారు. ఇంకా ఎంతకాలం స్టేలతో టైమ్ పాస్ చేస్తారు బాబు గారూ అంటూ నిలదీశారు.

కోర్టులల్లో స్టేలు తెచ్చుకోగలరేమో కానీ ప్రజా కోర్టులో మాత్రం ఏ స్టేలూ ఉండవు, మీ అవినీతి అక్రమాలకు జనాలు ఇక్కడ తమదైన తీర్పులో చిత్తుగా ఓడించేస్తున్నారు అంటూ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ డోస్ ఇచ్చేశారు.

అయినా ఇంకెంతకాలం స్టేలు తెచ్చుకుంటారు, ఏదో ఒక రోజు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్న ఆలోచన అయినా లేదా అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. 

ఇవన్నీ ఇలా ఉన్నా స్టేబీఎన్ అన్నది క్యాచీగా ఉందని అంటున్నారు. మొత్తానికి నిన్న కొడాలి నాని స్టే బాబు అంటే ఇపుడు ఏకంగా స్టేబీఎన్ అంటున్నారు విజయసాయిరెడ్డి.