చంద్ర‌బాబు కుల రాజ‌కీయానికి ఆ కుటుంబ‌మే నిర‌స‌న‌

ద‌ళితుల‌పై చంద్ర‌బాబు నాయుడుకు ఒక్కోసారి భ‌లేగా ప్రేమ పుట్టుకొస్తూ ఉంటుంది. మామూలుగా అయితే కుల వివ‌క్ష‌తో మాట్లాడేందుకు కూడా ఆయ‌న వెనుకాడే టైపు కాదు. ఎస్సీ కులాల్లో పుట్ట‌డం త‌క్కువ‌తనమ‌నే అభిప్రాయాన్ని డైరెక్టుగా వ్య‌క్తీక‌రించిన…

ద‌ళితుల‌పై చంద్ర‌బాబు నాయుడుకు ఒక్కోసారి భ‌లేగా ప్రేమ పుట్టుకొస్తూ ఉంటుంది. మామూలుగా అయితే కుల వివ‌క్ష‌తో మాట్లాడేందుకు కూడా ఆయ‌న వెనుకాడే టైపు కాదు. ఎస్సీ కులాల్లో పుట్ట‌డం త‌క్కువ‌తనమ‌నే అభిప్రాయాన్ని డైరెక్టుగా వ్య‌క్తీక‌రించిన వ్య‌క్తి ఆయ‌న‌. అది కూడా ముఖ్య‌మంత్రి హోదాలో ఉంటూ..'ఎవ‌రు కానీ ఎస్సీ కులాల్లో పుట్టాల‌నుకుంటారు..' అంటూ త‌న న‌ర‌న‌రానా ఉన్న కుల వివ‌క్ష‌ను వ్య‌క్తీక‌రించిన వ్య‌క్తి చంద్ర‌బాబు నాయుడు.  త‌ను సీఎం హోదాలో ఉన్న విష‌యాన్ని కూడా గ్ర‌హించ‌కుండా త‌న వ్య‌క్తిత్వాన్ని చూపించారాయ‌న‌. 

అదే రాజ‌కీయ అవ‌స‌రాలు వ‌చ్చాయంటే.. మాత్రం ఎస్సీల‌పై అపార‌మైన జాలిని ఉచితంగా చూపించేస్తారు! మ‌త్తు డాక్ట‌ర్ సుధాక‌ర్ విష‌యంలో అయితే చంద్ర‌బాబు జాలి అంతా ఇంతా కాదు. ఈ జాలి విష‌యంలో చంద్ర‌బాబుకు ఆయ‌న త‌న‌యుడు కూడా పోటీకి వ‌స్తున్నారు.

ఇక చిత్తూరు జిల్లాలో ఓంప్రతాప్ అనే ద‌ళిత యువ‌కుడి మ‌ర‌ణంపై కూడా చంద్ర‌బాబు నాయుడు త‌న ట్వీట్ల రాజ‌కీయంలో చాలా స్పందిస్తున్నారు. వ‌ర‌స పెట్టి ట్వీట్లు చేస్తున్నారు. అయితే చంద్ర‌బాబుకు శ‌వ‌రాజ‌కీయాలు బాగా అల‌వాట‌నే సంగ‌తి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొన్ని మ‌ర‌ణాల‌ను ఆయ‌న రాజ‌కీయంగా  ఉప‌యోగించుకుంటూ ఉంటారు. విజ‌యవాడ‌లో ఆసుప‌త్రి నిర్ల‌క్ష్యంతో ప‌ది మంది చ‌నిపోతే వారి మ‌ర‌ణాల‌పై చంద్ర‌బాబు స్పందించ‌రు. అదే ఒక ద‌ళిత యువ‌కుడు అనారోగ్యంతో చనిపోతే మాత్రం తెగ స్పందిస్తున్నారు. అదేమంటే ఇక్క‌డ చంద్ర‌బాబుకు రాజ‌కీయ అవ‌స‌రం.

ఈ విష‌యంపై స‌ద‌రు ఓం ప్ర‌తాప్ కుటుంబీకులే స్పందించారు. అత‌డి అన్న‌, అత‌డి చిన్నాన్న‌లు మీడియాతో మాట్లాడారు. ఓంప్ర‌తాప్ అనారోగ్యంతో మ‌ర‌ణించాడ‌ని వారు వివ‌రించారు. త‌మ కుటుంబ స‌భ్యుడి మ‌ర‌ణాన్ని చంద్ర‌బాబు నాయుడు శ‌వ‌రాజ‌కీయం కోసం వాడుకుంటున్నార‌ని వారు వ్యాఖ్యానించారు.

ఆ నీఛ రాజ‌కీయాన్ని చాలించాల‌ని వారు చంద్ర‌బాబు నాయుడును కోరారు. ఇలా ఉచిత జాలి ప్ర‌క‌టించి, ఆయా కుటుంబ స‌భ్యుల‌తో కూడా ఛీద‌రింపును ఎదుర్కోవ‌డం చంద్ర‌బాబుకు కొత్త కూడా కాదు. ఇది వ‌ర‌క‌టి ప‌లు శ‌వ రాజ‌కీయాల్లో కూడా చంద్ర‌బాబుకు అలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. అయినా చంద్ర‌బాబు తీరు మార‌దు.

ఆర్ ఆర్ ఆర్  తర్వాత తారక్ ని ఆపలేం