పల్నాడు గోల.. ‘కుల’ నేతలను దాచిన చంద్రబాబు!

పల్నాడులో తమ పార్టీ వారిపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించడానికే ఈ పోరాటం అంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించుకున్నారు. మిగతా ప్రాంతాలకు ప్రమేయం లేదని వారి మాటల్లోనే స్పష్టం అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పుడల్లా…

పల్నాడులో తమ పార్టీ వారిపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించడానికే ఈ పోరాటం అంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించుకున్నారు. మిగతా ప్రాంతాలకు ప్రమేయం లేదని వారి మాటల్లోనే స్పష్టం అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పుడల్లా వీళ్లు చేసే  రభసే ఇది. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఇలాంటి రాజకీయం చేస్తూ ఉంటారు.

ఇప్పుడు పల్నాడు వంతు వచ్చింది. మరి పల్నాడు లో చంద్రబాబు సాగిస్తున్న ఈ పోరాటంలో ఎవరు కనిపించాలి? కాస్త కామన్ సెన్స్ ఉపయోగిస్తే..అక్కడి స్థానిక తెలుగుదేశం నేతలు కనిపించాలి. అధికారం కోల్పోయినప్పుడు ఎమ్మెల్యేలుగా ఓడిన వాళ్లు ఇప్పుడు రంగంలోకి దిగాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు తమపై, తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తాలి. అయితే చంద్రబాబు మార్కు పోరాటంలో.. వాళ్ల ఉనికే లేదు!

పల్నాడు ప్రాంతంలోని టీడీపీ నేతలు యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాద్, కొమ్మాలపాటి శ్రీధర్, ప్రతిపాటి పుల్లారావు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వంటి వాళ్లు ఇప్పుడు సీన్ లో కనింపించాల్సింది. అయితే వాళ్లెవ్వరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. హడావుడి చేయడం లేదు.

ఇంతకీ హడావుడి చేస్తున్నది ఎవరయ్యా అంటే.. భూమా అఖిలప్రియ, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, పయ్యావుల కేశవ్.. వీళ్లు! ఎక్కడి వారు వీళ్లంతా? వీళ్లకూ పల్నాడుకు ఏమైనా సంబంధం ఉందా? స్థానికులపై దాడులు జరుగుతున్నాయని సాక్ష్యం చెప్పడానికి వీళ్లెవ్వరు? వీళ్లు అక్కడ ఉంటారా? అక్కడేం జరిగిందో  వీళ్లకు తెలుసా? ఈ రకంగానూ వీళ్ల మాటలు కన్వీన్సింగ్ లేవు. ఇప్పుడు ముందుకు రావాల్సింది కోడెల, యరపతినేని, ఆంజనేయుడు, ప్రత్తిపాటి, కొమ్మాల పాటిలు..అయితే వాళ్లు అడ్రస్ లేరు.

ఇదే చంద్రబాబు నాయుడి గేమ్ అని అంటున్నారు పరిశీలకులు. వాళ్లంతా ఒకే సామాజికవర్గం వాళ్లు. ఇప్పుడు దాడులు జరిగాయంటూ గగ్గోలు పెడుతున్న వాళ్లు అనగా… శిబిరాల్లో ఉన్న వారు కూడా అదే సామాజికవర్గం వాళ్లని తెలుగుదేశం వాళ్లే చెప్పకనే చెబుతున్నారు. అయితే ఆ కులం నేతలు గగ్గోలు పెడితే, ఇన్నాళ్లూ ఆ ప్రాంతంలో రచ్చలు చేసిన వారు ఇప్పుడు హడావుడి చేస్తే.. ఏరకంగానూ సానుభూతి రాదని చంద్రబాబు నాయుడు గ్రహించినట్టుగా తెలుస్తోంది.

అందుకే వ్యూహాత్మకంగా రెడ్డి, కాపు, వెలమ, బీసీ నేతలను తెర మీదకు తెచ్చి వారితో జగన్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఇందుకే కదా.. తెలుగుదేశం పార్టీలో ఇతర కులాల నేతలున్నాది! ఒక కులం నేతలు దాష్టీకాలు చేసిన ప్రాంతంలో వేరే వాళ్లు వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడాలి. వారి రక్షణ కోసమే వీళ్లంతా ఆ పార్టీలో ఉన్నదని.. పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడి మార్కు కుల రాజకీయాలు ఇలానే ఉంటాయని వారు విశ్లేషిస్తున్నారు.