కాపులతో చంద్రబాబు సమీక్ష కామెడీగా!

'కులాల వారీగా సమావేశాలు పెట్టవద్దు.. అది పార్టీకి మంచిది కాదు..' అని కాపు నేతలకు ఉద్భోదించారట చంద్రబాబు నాయుడు. అదే సందర్భంలో అనుకుంటున్నారు? 'కాపు సామాజికవర్గం నేతలతో చంద్రబాబు సమావేశం'లో ఆయన అలా సందేశం…

'కులాల వారీగా సమావేశాలు పెట్టవద్దు.. అది పార్టీకి మంచిది కాదు..' అని కాపు నేతలకు ఉద్భోదించారట చంద్రబాబు నాయుడు. అదే సందర్భంలో అనుకుంటున్నారు? 'కాపు సామాజికవర్గం నేతలతో చంద్రబాబు సమావేశం'లో ఆయన అలా సందేశం ఇచ్చారు. కాపు కుల నేతలతోనే చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం పెట్టొచ్చు. వాళ్లు మాత్రం ప్రత్యేకంగా సమావేశం పెట్టకూడదు! ఇదీ చంద్రబాబు మార్కు నీతి.

పార్టీలోని ఒక కులం వారిని తను పిలిచి మాట్లాడొచ్చు, అది పార్టీకి ఎలాంటి సంకేతాలను ఇస్తుందో చంద్రబాబుకే తెలియాలి. వారు సమావేశం పెట్టుకుంటే అది మాత్రం పార్టీకి తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ఇలా నీతులు చెబుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు.

ఇక కాపు కుల నేతలతో చంద్రబాబు నాయుడు సమీక్షలో కాపులు తెలుగుదేశం పార్టీకి ఎందుకు దూరం అయ్యారో చర్చించారట. అది తనకు అంతే బట్టలేదని చంద్రబాబు నాయుడు వాపోయారట. కాపులకు తాము ఎంతో ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా చెప్పారట. అయినా వారు దూరం అయ్యారని వాపోయారట. అయితే చంద్రబాబు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. ఆయనకు దూరం అయ్యింది కాపులు మాత్రమేకాదు అందరూ!

ఏపీలో సామాజికవర్గాల తేడాలు లేకుండా అందరికి అందరూ చంద్రబాబుకు దూరం అయ్యారు. అలా సాగింది ఆయన పాలన, ఆ విషయాన్ని ఇంకా ఒప్పుకోకుండా.. ఇలాగే డ్రామాలు వేస్తూ ఉంటే అంతే సంగతులు. ఇక కొందరు కాపు నేతలు చంద్రబాబు వద్ద పలు విషయాలను ప్రస్తావించారట. ముద్రగడతో సరిగా వ్యవహరించలేదని, ఆయనతో  పోలీసులు దారుణంగా వ్యవహరించారని, ఆయన ఇంట్లో వాళ్లను బూతులు తిట్టారని చెప్పారట.

అయినా ముద్రగడ విషయంలో అనుచితంగా వ్యవహరించింది పోలీసులే అయినప్పటికీ, అదంతా లోకేష్ ఆదేశాల మేరకే అని వారు చెప్పలేదా? లోకేష్ ఆ  సమయంలో డైరెక్టుగా జోక్యం చేసుకుని బూతులు తిట్టాడు అని ముద్రగడ వాపోయారు కదా.. ఆ విషయాన్ని చంద్రబాబు వద్ద కాపు నేతలు గుర్తు చేయలేదేమో!

ఇక తామంతా తెలుగుదేశమే అని మాత్రం చెప్పారట ఆ సమావేశానికి హాజరైన కాపునేతలు. ఇది మాత్రం చంద్రబాబుకు చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నమే అని అంటున్నారు పరిశీలకులు. ఆ విషయం ముందు ముందు తెలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు!

టీడీపీ ఎమ్మెల్యే, రాజీనామాకూ రెడీ? జగన్ ఒప్పుకుంటాడా?