తప్పులో కాలు ఎలా వేశాడు?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఎంతో అనుభవం ఉన్న నాయకుడు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన లీడర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే కాదు, విభజన తరువాత ఏర్పడిన రాష్ట్రానికీ మొదటి సీఎం ఆయనే.  Advertisement…

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఎంతో అనుభవం ఉన్న నాయకుడు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన లీడర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే కాదు, విభజన తరువాత ఏర్పడిన రాష్ట్రానికీ మొదటి సీఎం ఆయనే. 

ఫలానా వాళ్ళను ప్రధానమంత్రిని చేసింది నేనే, ఫలానా వాళ్ళను రాష్ట్రపతిని చేసింది నేనే అని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన అధికారంలో ఉన్నంత కాలం తానెప్పుడూ తప్పు చేయలేదని, ఎప్పుడూ చేయబోనని బల్ల గుద్దేవారు. తప్పులు చేసినవారు భయపడాలి. నేనెందుకు భయపడాలి అనేవారు.

కానీ ఇలాంటి గొప్ప లీడరు, అనుభవజ్ఞుడు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఎవరికి? అధికార పక్షానికి, సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేక ఎన్నికలు జరిగాయి. మరి ఈ పెద్దమనిషికి ఏ ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలియదా? తెలియదని అనుకోవడానికి లేదు. 

కానీ పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పాలనే తాపత్రయం, కసి, ఆరాటం ఇలాంటివన్నీ ఆయన్ని నిబంధనలు, విధానాలు మర్చిపోయేలా చేశాయి. బాబు చేసిన తప్పు తెలుసు కదా. పార్టీలకు అతీతంగా అంటే పార్టీ ప్రాతిపదికన కాకుండా జరిగే పంచాయతీ ఎన్నికలకు బాబు మేనిఫెస్టో విడుదల చేశారు.

మేనిఫెస్టో అంటే ఏమిటి ? అధికారంలోకి వస్తే ఫలానా పనులు చేస్తామని హామీలు ఇవ్వడం. పార్టీ ప్రాతిపదికన పంచాయతీ ఎన్నికలు జరగనప్పుడు మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారు? మేనిఫెస్టో విడుదల చేయకూడదని తమ్ముళ్లు కూడా ఎవరూ చెప్పలేదా? టీడీపీలో కురువృద్ధులు చాలామంది ఉన్నారు కదా. వారికి ధర్మ సూక్ష్మాలు బాగా తెలుసు కదా. బాబు పరువు నిలబెట్టాలని వారు ఎందుకు అనుకోలేదో. 

ఇప్పటివరకు సీఈసీ రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా ఉండి వైసీపీని ఇబ్బందుల్లో పెడుతున్నారని వైసీపీ నాయకులు అనుకున్నారు కానీ రమేష్ కుమార్ ఇప్పుడు టీడీపీకి కూడా షాక్ ఇచ్చారు. టీడీపీకి షాక్ ఇవ్వడంతో వైసీపీ నాయకులు ఆనందంలో ఉన్నారు. కానీ రాజకీయాల్లో మాత్రం ఎంతో అనుభవం ఉన్న బాబు మాత్రం ఇప్పుడు ఎందుకు  తప్పు  చేశారని రాజకీయ నేతలు  చర్చించుకుంటున్నారు. 

ఇప్పటి వరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు వైసీపీకి మాత్రమే షాక్ లు ఇస్తూ వచ్చారు. అయితే మొదటిసారి టీడీపీకి షాక్ ఇచ్చారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ విడుదల చేసిన  మేనిఫెస్టోను ఎన్నికల కమిషన్ రద్దు చేసిపారేసింది.  అయినా  స్థానిక ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చెయ్యడం ఏంటని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. 

రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే బాబు కూడా ఇలాంటి పొరపాట్లు చెయ్యడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. బాబుకు వయసు పెరుగుతున్న కొద్దీ చాదస్తం పెరుగుతున్నట్టు ఉంది, అలాగే ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో కూడా పస తగ్గుతోంది. 

రాజకీయాల్లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న బాబు కూడా ఇప్పుడు ఇలాంటి చిన్న తప్పులు చేస్తూ నవ్వుల పాలు అవుతున్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న బాబు టీడీపీని మళ్ళీ ఎలా అధికారంలోకి తీసుకు వస్తారో. 

మనకి బూతులు జనాలకు కాదు

చంద్రబాబు వచ్చే వరకూ టీవీల్లో మాట్లాడిన పట్టాభి..