ఈ ఫొటోకి కాలం చెల్లినట్టేనా..?

చంద్రబాబు ఫొటో పెట్టి, వార్తలు రాసే ఏ మీడియాకైనా ఈ ఫొటో బాగా పరిచయం. స్టాక్ ఫొటోస్ లో కచ్చితంగా ఇది ఉంటుంది. బాబు ఇబ్బంది పడ్డారు, టీడీపీకి వ్యతిరేక ఫలితాలొచ్చాయి, చంద్రబాబు కార్నర్…

చంద్రబాబు ఫొటో పెట్టి, వార్తలు రాసే ఏ మీడియాకైనా ఈ ఫొటో బాగా పరిచయం. స్టాక్ ఫొటోస్ లో కచ్చితంగా ఇది ఉంటుంది. బాబు ఇబ్బంది పడ్డారు, టీడీపీకి వ్యతిరేక ఫలితాలొచ్చాయి, చంద్రబాబు కార్నర్ అయ్యారు, డైలమాలో బాబు అని రాసే ఏ వార్తకైనా ఈ ఫొటోనే ఆధారం. 

చంద్రబాబు అని గూగుల్ లో వెదికితే.. మొదటగా కనిపించే ఫొటోల్లో ఇది కూడా ఒకటి. చంద్రబాబు విచార వదనానికి ఇది సిగ్నేచర్ ఫొటో. అలాంటి ఈ ఫొటోకి ఇప్పుడు కాలం చెల్లింది. దండేసి దండం పెట్టడం అనడం కరెక్ట్ కాదేమో కానీ, ఈ ఫొటోకి మాత్రం నిజంగా అలాంటిదే చేయాల్సిన సమయం వచ్చేసింది.

అవును, ఇప్పుడు అంతకంటే మంచి ఫొటోలు జనాలకి చేరువయ్యాయి. కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు శాడ్ నెస్ అని గూగుల్ లో వెదికితే.. కచ్చితంగా ఇప్పుడీ పాత ఫొటో కనిపించకపోవచ్చు. ఎందుకంటే అంతకంటే ఎక్కువగా, చంద్రబాబు మీడియా ముందు ఏడ్చేసిన ఫొటోలే ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యాయి.

నటన అనండి, సహజ నటన అనండి, అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అనండి..  మొత్తానికి చంద్రబాబు ఏడుపు సీన్ మాత్రం ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయేలా ఉంది. కళ్లు తుడుచుకోవడం, రెండు చేతులతో మొహాన్ని కప్పుకోవడం.. ఇలా ఈ ఫొటోలు బాగా ఫేమస్ అయిపోయాయి. ప్రస్తుతం చంద్రబాబు అని గూగుల్ ఫొటోస్ లో వెదికితే.. మొదట వరసంతా కనిపించేది ఆయన ఏడుపు ఫొటోలే.

చాలామంది నాయకులు బాధపడిన సందర్భాలున్నాయి, మీడియా ముందు గొళ్లుమన్న ఉదాహరణలూ ఉన్నాయి. కానీ చంద్రబాబు లాగా మాత్రం ఎవరూ వెక్కివెక్కి ఏడ్వలేదు, భవిష్యత్తులో ఏడవరు కూడా. అసలు ఏడుపంటే ఏంటి?

క్రైయింగ్ ఆంధ్రప్రదేశ్ అని గూగుల్ లో వెదికినా ప్రస్తుతం చంద్రబాబు ఫొటోలే ముందు వరుసలో కనిపిస్తున్నాయి. అంతలా ఈయన ఏడుపు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. పాత ఫొటోకు కాలం చెల్లింది, కొత్త ఏడుపుగొట్టు ఫొటోలకు ఎక్కడలేని ప్రచారం లభించింది.