సీనియర్ నటుడు, నిర్మాత కైకాల సత్యనారాయణ ఆరోగ్యం సీరియస్ గా వుందని వార్తలు అందుతున్నాయి. ఆయన కొన్ని రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
సుమారు ఇరవై రోజుల కిందట. ఆయన తన ఇంట్లో కాలు జారి పడ్డారు. అప్పటి నుంచీ ఆసుపత్రిలోనే వున్నారు. ఆ మద్య ఆరోగ్యం కుదుట పడిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ పరిస్థితి సీరియస్ గా వుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స జరుగుతోంది. విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా, పురాణ పాత్రలను అసమానంగా పోషించిన కైకాల సత్యనారాయణ తనకు తానే సాటి అనిపించుకున్నారు.
ఎస్వీ రంగారావు తరువాత అంతటి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. గత కొంత కాలంగా విశ్రాంతి తీసుకుంటూ ఇంటి పట్టునే వుంటున్నారు.