చంద్రబాబు.. రాష్ట్రపతిని కూడా కలుస్తారేమో!

అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడును ఎదుర్కొన్నాం, ఇప్పుడు ఆయన కుటిల రాజకీయాలు చేస్తే అవి చెల్లుబాటు కావు.. అని అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు. కోడెల శివప్రసాద్ రావు మరణంపై చంద్రబాబు నాయుడు…

అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడును ఎదుర్కొన్నాం, ఇప్పుడు ఆయన కుటిల రాజకీయాలు చేస్తే అవి చెల్లుబాటు కావు.. అని అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు. కోడెల శివప్రసాద్ రావు మరణంపై చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు… ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఆయన చేసే రాజకీయాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.. అని వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కోడెల మరణాన్ని చంద్రబాబు నాయుడు ఎంత వరకూ వాడుకుంటారు? అనేది ఆసక్తిదాయకమైన ప్రశ్న.

కోడెల బతికి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనను పట్టించుకోని సంగతిని అంతా గమనిస్తూనే ఉంటారు, కోడెలకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదట చంద్రబాబు నాయుడు.  అలాగే సత్తెనపల్లి ఇన్ చార్జి పదవి నుంచి కూడా ఆయనను తప్పించడానికి రంగం సిద్ధం అయ్యిందని తెలుస్తోంది. ఇప్పుడు కోడెల మీద అపారమైన సానుభూతిని చూపుతున్న చంద్రబాబు నాయుడు .. కోడెల గుండెపోటుకు గురి అయినప్పుడు  లేదా ఇంతకు ముందే ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు కనీసం పరామర్శించింది లేదు!

అప్పుడే చంద్రబాబు నాయుడు ఆయనను కలిసి ధైర్యం చెప్పి ఉంటే, కుటుంబ సమస్యల విషయంలో కూడా భరోసాను ఇచ్చి ఉంటే.. కోడెల కూతురు, కొడుకును తను పిలిపించుకుని మాట్లాడి ఉంటే.. పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని పరిశీలకులు అంటున్నారు.

అప్పుడు తనకెందుకు  అనుకుని, కోడెలను కలిస్తే పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుందని.. చంద్రబాబు నాయుడు లెక్కలేసుకున్నారు. ఆఖరికి పల్నాడులో టీడీపీ రచ్చ సమయంలో కూడా కోడెలను కలుపుకుపోలేదు. ఆయనను పిలిస్తే తమ ప్రోగ్రామ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని టీడీపీ వాళ్లు భావించారు. అంతజేసీ ఇప్పుడు కోడెల మరణం అంశాన్ని అరిగేదాకా తన రాజకీయానికి వాడుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్న వైనం  తీవ్రవిమర్శల పాలవుతోంది.

ఇప్పటికే ఈ అంశంపై చంద్రబాబు నాయుడు  గవర్నర్ ను కలిశారు. రేపోమాపో రాష్ట్రపతిని కూడా కలవొచ్చు. నవ్విపోతారనే ఫీలింగ్స్ ఏమీ చంద్రబాబులో కనపడవు కాబట్టి.. ఆయన ఏమైనా చేయగలరు, అయితే ఈ రాజకీయాలు మరింత అసహ్యం పాల్వడమే తప్ప చంద్రబాబుకు కూడా మైలేజీ ఇచ్చేది లేదని పరిశీలకులు అంటున్నారు!

పవన్ సినిమా క్యాన్సిల్ అయితే నా మానసిక పరిస్థితి ఇది