తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రిమాండ్ ను మరింతగా పొడిగించింది న్యాయస్థానం. వచ్చేనెల తొమ్మిదో తేదీ వరకూ చింతమనేని రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గత ఇరవై యేళ్లలో చింతమనేని ప్రభాకర్ మీద మొత్తం యాభైకి పైగా కేసులు నమోదు అయ్యాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. అయితే అవి కేసులుగా మాత్రమే మిగిలిపోయాయి.
కొన్ని కేసులు మాత్రమే విచారణకు నోచుకున్నాయి. వాటిల్లో చింతమనేనికి శిక్ష కూడా పడింది. ఆ లెక్క ప్రకారం ఆయన ఎప్పుడో అనర్హుడు కావాల్సింది. అయితే ఆయన తనకు పడిన శిక్షపై పైకోర్టుకు వెళ్లారు. బెయిల్ తెచ్చుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ పవర్ కోల్పోవడంతో చింతమనేనిపై నమోదు అయిన వివిధ కేసుల విచారణ వేగం పుంజుకుంది.
దీంతో మొదట చింతమనేని ప్రభాకర్ పరార్ అయ్యారు. కొన్నిరోజుల పాటు అలా పరారీలో ఉండి, చివరకు ఇంటికి రాగా పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. రిమాండ్ కు తరలించారు. ముందస్తు, తరువాత బెయిల్ ప్రయత్నాలు విఫలం కావడంతో… ఈనెల తొమ్మిదో తేదీ వరకూ చింతమనేని రిమాండ్ ను కోర్టు పొడిగించింది. దీంతో ఈ టీడీపీ నేత ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశాలు లేవని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.