ఆయన తీహార్ లోనే.. సోనియా పరామర్శించలేదా!

కర్ణాటక మాజీమంత్రి డీకే శివకుమారకు మరోసారి భంగపాటు ఎదురైంది. ఆయనకు స్పెషల్ కోర్డు బెయిల్ నిరాకరించింది. ఇప్పటికే కొన్నాళ్లుగా పోలీస్ కస్టడీలో ఉన్న ఆయనకు మరికొంతకాలం అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ ఫోర్స్…

కర్ణాటక మాజీమంత్రి డీకే శివకుమారకు మరోసారి భంగపాటు ఎదురైంది. ఆయనకు స్పెషల్ కోర్డు బెయిల్ నిరాకరించింది. ఇప్పటికే కొన్నాళ్లుగా పోలీస్ కస్టడీలో ఉన్న ఆయనకు మరికొంతకాలం అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో డీకే శివకుమార అరెస్టు అయిన సంగతి తెలిసిందే.

ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని కాంగ్రెస్ పార్టీ అంటోంది. దక్షిణాదితో పాటు, గుజరాత్ వరకూ కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ ఉన్న డీకే శివకుమారను అరెస్టు చేసి కాంగ్రెస్ దెబ్బకొట్టాలని బీజేపీ భావిస్తోందని.. కాంగ్రెస్  నేతలు వాదిస్తూ ఉన్నారు. ఇప్పటికే డీకే అరెస్టుపై కర్ణాటక కాంగ్రెస్ వాళ్లతో పాటు, వక్కలిగ కమ్యూనిటీ కూడా భగ్గుమంది. అయితే ఆయనకు న్యాయస్థానం మాత్రం ఊరటను ఇవ్వలేదు.

ఆయనను తీహార్ జైలుకే పరిమితం చేసింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ తీహార్ జైలును సందర్శించారు. అక్కడ ఉన్న తమ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి  చిదంబరాన్ని ఆమె పరామర్శించారు.

విశేషం ఏమిటంటే డీకే శివకుమార కూడా అక్కడే ఉన్నారు. ఆయన అరెస్టు పట్ల ఇప్పటికే సోనియాగాంధీ నిరసన వ్యక్తంచేశారు. అయితే తీహార్ లో మాత్రం ఆమె శివకుమారను పరామర్శించినట్టుగా లేరు.

సైరాపై డైరెక్టర్ అంచనాలేంటి..?