చిరంజీవి హోల్ సేల్.. పవన్ రిటైల్

ప్రజారాజ్యం ఒకే ఒక్క విలీనంతో చచ్చిపోయింది. కానీ జనసేన ప్రతి రోజూ చచ్చిపోతూనే ఉంది.  Advertisement ప్రజారాజ్యం విషయంలో చిరంజీవిని చాలామందే తిట్టుకున్నారు. అయితే ఇప్పుడు జనసేన విషయంలో పవన్ కల్యాణ్ చేస్తున్న పనులు…

ప్రజారాజ్యం ఒకే ఒక్క విలీనంతో చచ్చిపోయింది. కానీ జనసేన ప్రతి రోజూ చచ్చిపోతూనే ఉంది. 

ప్రజారాజ్యం విషయంలో చిరంజీవిని చాలామందే తిట్టుకున్నారు. అయితే ఇప్పుడు జనసేన విషయంలో పవన్ కల్యాణ్ చేస్తున్న పనులు చూస్తుంటే వారందరికీ చిరంజీవిపై గౌరవం పెరుగుతోంది. తమ్ముడి కంటే అన్న వంద రెట్లు మేలని అనుకునేలా చేశారు పవన్. చిరంజీవి ప్రజారాజ్యాన్ని హోల్ సేల్ గా అమ్మేసి ప్రతిఫలం పొందితే, పవన్ రిటైల్ గా జనసేనని బేరం పెట్టి.. ప్రతి ఐదేళ్లకో సారి ప్రతిఫలం పొందుతున్నారు. 

పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న పిల్లిమొగ్గలు, జనసైనికులకు చేస్తున్న ద్రోహం చూస్తుంటే నిజంగానే చిరంజీవిపై గౌరవం పెరగకమానదు. చేసిందేదో ఒకేసారి తప్పు చేసి ప్రజారాజ్యం జెండా పీకేసి అందరి ఆశల్నీ ఒకేసారి చంపేశారు చిరంజీవి. పవన్ అలా కాదు, కర్ర విరగకూడదు, పాము చావకూడదు అనే టైపు. తనని నమ్ముకుని వచ్చినవారిని పదే పదే మోసం చేస్తున్నారు.

2014లో టీడీపీ, బీజేపీతో లాలూచీ పడి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎవరికీ దక్కకుండా చేశారు. 2019లో అయినా తాడోపేడో తేల్చుకుందామనుకుంటే.. అప్పుడు కూడా టీడీపీతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని బలహీన ప్రత్యర్థుల్ని మాత్రమే రంగంలోకి దింపారు. గెలుపు అవకాశాలున్నచోట్ల ప్రచారానికే రాకుండా వారి ఆశలు చంపేశారు. తమవాళ్ల ఓటమికి తానే కారణమయ్యారు.

ఇక 2024.. దీనిపై కూడా ఎవరికీ నమ్మకాలు లేవు. బీజేపీతో అంటకాగుతానంటూ ప్రకటించిన పవన్.. పొత్తుల్లో భాగంగా ఎంతమంది కొత్తవారికి అవకాశాలిస్తారనేది సందేహమే. జనసేనని నమ్ముకుని మరో నాలుగున్నరేళ్లు పార్టీ కోసం పనిచేసినా 2024లో టికెట్ వస్తుందనే నమ్మకం లేదు. అందుకే జనసైనికుల్లో పవన్ పై రోజురోజుకు నమ్మకం పోతోంది.