రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ల రాజీనామాలు ఏపీ గవర్నర్ చేత ఆమోదం పొందాయి. ఈ క్రమంలో వారు నిర్వర్తించిన మంత్రిత్వ శాఖలు ఏపీ సీఎం జగన్ చేతికి వెళ్లాయని తెలుస్తోంది. మంత్రుల రాజీనామాల ఆమోదంతో ఆ శాఖలు సీఎం చేతికి వెళ్లినట్టుగా సీఎస్ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.
మోపిదేవి వెంకటరమణ పశుసంవర్థక శాఖా మంత్రిగా వ్యవహరించగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలకమైన రెవెన్యూ-స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. వారిద్దరి రాజీనామాల సంగతి తెలిసిందే, వారు రాజ్యసభ సభ్యులయ్యారు. ఈ క్రమంలో కొత్తగా ఇద్దరు మంత్రులు కూడా ఖరారయ్యారు.
సీదిరి అప్పల్రాజు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణలు కొత్త మంత్రులు. అయితే వీరికి శాఖల కేటాయింపు జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే రాజీనామా చేసిన మంత్రుల శాఖలు సీఎం జగన్ చేతి కే వెళ్లాయి. శాఖల కేటాయింపుల అనంతరం పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొత్త వారికి అవే శాఖలు ఇచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. శాఖల్లో మార్పు చేర్పులు తప్పనిసరిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.