కొన్ని సడలింపులు.. ఇంకొన్ని నిబంధనలు

ఆంధ్రప్రదేశ్ లో తగ్గుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని సడలింపులిచ్చింది ప్రభుత్వం. అదే టైమ్ లో కొన్ని నిబంధనల్ని కూడా కఠినతరం చేసింది. ముందుగా సడలింపుల విషయానికొద్దాం. Advertisement రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో…

ఆంధ్రప్రదేశ్ లో తగ్గుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని సడలింపులిచ్చింది ప్రభుత్వం. అదే టైమ్ లో కొన్ని నిబంధనల్ని కూడా కఠినతరం చేసింది. ముందుగా సడలింపుల విషయానికొద్దాం.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులిచ్చారు. మొన్నటివరకు తూర్పుగోదావరి జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఆంక్షలు కొనసాగగా.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన సడలింపులిచ్చారు.

రాత్రి 9 గంటల కల్లా షాపులు మూసేయాలి. 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఈరోజు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

ఓవైపు సడలింపులు ఇచ్చినప్పటికీ, మరోవైపు నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేకపోతే వంద రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించారు. 

ఇక దుకాణాల్లో సిబ్బంది మొత్తం మాస్కులు పెట్టుకోవాల్సిందే. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, జరిమానా విధించడంతో పాటు 2-3 రోజుల పాటు దుకాణం మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

మాస్క్ పెట్టుకోకుండా తిరిగేవారిని గుర్తించేందుకు ఓ వాట్సాప్ నంబర్ కేటాయించాలని కూడా నిర్ణయించారు. మాస్క్ పెట్టుకోకుండా బయట తిరిగే వ్యక్తుల ఫొటోల్ని ఆ నంబర్ కు వాట్సాప్ చేస్తే, వాళ్లను గుర్తించి జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.