విశాఖ రాజధాని కోసం ఆందోళనలు

పెడతామంటే ఆశ కొడతామంటే బెదురు ఎవరికైనా సహజమే. విశాఖను రాజధానిగా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. అన్న మాటకు కట్టుబడి మూడు రాజధానులపైన చట్టం కూడా చేశారు. Advertisement దీని మీద ఇపుడు…

పెడతామంటే ఆశ కొడతామంటే బెదురు ఎవరికైనా సహజమే. విశాఖను రాజధానిగా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. అన్న మాటకు కట్టుబడి మూడు రాజధానులపైన చట్టం కూడా చేశారు.

దీని మీద ఇపుడు కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. అయితే విశాఖ రాజధానిని అడ్డుకుంటున్నది ఎవరో అందరికీ తెలుసు. చంద్రబాబు తన మనుషుల ద్వారా కోర్టులో కేసులు వేయించి విశాఖ అభివ్రుధ్ధిని అడ్డుకుంటున్నారని నగరవాసులు విమర్శిస్తున్నారు.

ఇక తాము కూడా ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని అంటున్నారు. కోర్టుల్లో కూడా కేసులు వేస్తామని చెబుతున్నారు. దీంతో రాజధాని కోసం మెల్లగా ఉద్యమాలు మొదలవుతున్నాయి. జాతీయ నాయకుల విగ్రహానికి వినతిపత్రాలు ఇవ్వడం, సంతకాల సేకరణ వంటివి కూడా చేపడుతున్నారు.

ఇపుడు స్వచ్చందంగా కొంతమంది యువకులు ముందుకు వచ్చి విశాఖ రాజధాని కోరుతూ రెండు రోజుల రిలే నిరశన దీక్షకు చేపట్టారు. మరి ఇదే తీరున రాజధాని రాక  ఆలస్యం అయితే విశాఖలోనూ ఉద్యమాలు పెరిగి పెద్దవైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఏది ఏమైనా విశాఖ జనాల్లో మాత్రం రాజధాని ఆశలు బాగా పెరిగాయని చెప్పాలి.