విడివిడిగా పోటీనా.. కలివిడిగా పోటీనా?

కర్ణాటక రాజకీయ పరిణామాల్లో ఉప ఎన్నికలపై చర్చ మొదలైంది. యడియూరప్ప ప్రభుత్వం ఏర్పడటం, బలనిరూపణ కూడా చేసుకోవడం జరిగింది. అయితే కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు  పడిపోవడానికి కారణం అయిన ఎమ్మెల్యేలందరి మీదా అనర్హత వేటు పడింది.…

కర్ణాటక రాజకీయ పరిణామాల్లో ఉప ఎన్నికలపై చర్చ మొదలైంది. యడియూరప్ప ప్రభుత్వం ఏర్పడటం, బలనిరూపణ కూడా చేసుకోవడం జరిగింది. అయితే కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు  పడిపోవడానికి కారణం అయిన ఎమ్మెల్యేలందరి మీదా అనర్హత వేటు పడింది. వారిపై అనర్హత వేటు వేసి, కాంగ్రెస్ నేత రమేశ్ కుమార్ స్పీకర్ పదవి నుంచి వైదొలిగారు. అనర్హత వేటు నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యేలా ఉన్నాయి. అయితే వాటికి మరి కాస్త సమయం ఉంది.

ఆ సీట్లు  అన్నీ కాంగ్రెస్-జేడీఎస్ లు గెలుచుకున్నవి.ఈ నేపథ్యంలో వాటిల్లో తిరిగి సత్తా చాటి బీజేపీకి ఝలక్ ఇవ్వాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ లు నెగ్గితే కథ మళ్లీ మొదటకు వచ్చినట్టే. ఒకవేళ బీజేపీ ఆ సీట్లలో మెజారిటీ వాటిని నెగ్గితే మాత్రం ప్రభుత్వం స్టాండ్ అయినట్టే.

ఇలాంటి నేపథ్యంలో ఆ సీట్లను ఎలాగైనా నెగ్గాలని కాంగ్రెస్-జేడీఎస్ లు భావిస్తూ ఉన్నాయి. అందు కోసం కలిసి పోటీ చేయడమా, లేక విడివిడిగా పోటీ చేయడమా.. అనే అంశం గురించి ఆ పార్టీలో సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్-జేడీఎస్ ల పొత్తు మామూలుగా అయితే అనైతికం. ఎందుకంటే ఈ ఇరు పార్టీలకూ చాలా నియోజకవర్గాల్లో సమస్థాయిలో బలం ఉంది.

అలాంటి పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఓటు బ్యాంకు కలయిక కన్నా, విబేధాలతో రచ్చే ఎక్కువగా జరుగుతుంది. ఈ రెండూ  కలిసి పోటీ చేస్తే బీజేపీకే ఎక్కువ మేలు జరుగుతుంది. అదెలా ఉంటుందో లోక్ సభ సార్వత్రిక ఎన్నికలప్పుడు స్పష్టం అయ్యింది. అందుకే ఈ సారి పొరపాటు చేయకూడదని.. కలిసి పోటీ చేయడమా, విడివిడిగానా అనేది సోనియా, దేవేగౌడలే తేలుస్తారని ఈ ఇరు పార్టీల నేతలూ అంటున్నారు.

'కామ్రేడ్'కు నిర్వచనం అదా!