అప్పుడేం చేశారు దేవినేని ఉమ?

'2004 నుంచి 2014 వరకూ జలయజ్ఞంలో జరిగిన అవినీతి గురించి నివేదికను బయట పెట్టాలి..' ఇదీ తెలుగుదేశం నేత దేవినేని ఉమ డిమాండు!  పోలవరం కాంట్రాక్టు వ్యవహారాల నుంచి నవయుగను తప్పించడంపై తెలుగుదేశం పార్టీ…

'2004 నుంచి 2014 వరకూ జలయజ్ఞంలో జరిగిన అవినీతి గురించి నివేదికను బయట పెట్టాలి..' ఇదీ తెలుగుదేశం నేత దేవినేని ఉమ డిమాండు!  పోలవరం కాంట్రాక్టు వ్యవహారాల నుంచి నవయుగను తప్పించడంపై తెలుగుదేశం పార్టీ తీవ్రాతితీవ్రంగా స్పందిస్తూ ఉంది. అందులో భాగంగా  గగ్గోలు పెట్టే బాధ్యతలను తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలంతా తీసుకున్నారు. దేవినేని ఉమా మహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కింజారపు అచ్చెన్నాయుడు.. వరస పెట్టి ఈ విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని  తీవ్రంగా వ్యతిరేకించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారాల్లో నవయుగ ఆధ్వర్యంలో అక్రమాలు జరిగాయని, నాటి ప్రభుత్వ పెద్దలు- నవయుగ సంస్థ కుమ్మక్కై అక్రమాలు చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూ ఉంది. ఆ సంస్థకు చేయని పనులకే చెల్లింపులు చేసిన ఘనత చంద్రబాబుది అని ప్రభుత్వం నిర్ధారించింది కూడా. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతల నుంచి వైదొలగాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతూ ఉంది.

ఈ గగ్గోలు పెట్టడంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్రాథమిక విషయాలను కూడా విస్మరిస్తూ వ్యవహరిస్తున్నారు. అలాగే ఉంది దేవినేని ఉమామహేశ్వరరావు వాదన. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారాల్లో జరిగిన అవినీతి బయటపెడతామని వైఎస్ జగన్ ప్రభుత్వం అంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ భుజాలు తడుముకుంటూ ఉంది. అందులో భాగంగా దేవినేని ఉమ మాట్లాడుతూ..'2004 నుంచి 2014 మధ్యన జలయజ్ఞంలో జరిగిన అవినీతికి సంబంధించి నివేదికను బయటపెట్టండి…' అని డిమాండ్ చేశారు. 

ఇదీ కామెడీ అంటే. 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం దేవినేని ఉమకు గుర్తుందా? లేదా? ఆయనే కదా సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా చేశారు! అలాంటప్పుడు వైఎస్-కిరణ్ ల హయాంలో అవినీతి వ్యవహారాలు చోటు చేసుకుని ఉంటే బయటపెట్టాల్సింది కదా! ఐదేళ్ల పాటు ఆ విషయం ఈ దేవినేనికి గుర్తుకు రాలేదా? తమ హయాంలో అక్రమాల గురించి బయటపెడతామనే సరికి, మళ్లీ వైఎస్ హయాం గురించి మాట్లాడటమా! వైఎస్ హయాంలో ఏదైనా జరిగి ఉంటే బయటపెట్టకుండా గత ఐదేళ్లూ ఏం చేసినట్టు? ఇప్పుడు మళ్లీ పాత ఆరోపణలు చేసి తెలుగుదేశం తప్పించుకునే ప్రయత్నం చేయడమా!

'కామ్రేడ్'కు నిర్వచనం అదా!