మర్కజ్ బృందం కరోనాను అంటించుకుందని తెలియక ముందు వరకూ ఇండియాలో కరోనా కేసుల సంఖ్య చాలా చాలా తక్కువ. అప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలోనే ఆందోళన. అంత వరకూ దేశదేశాలనూ తిరిగి ఇండియాకు వచ్చిన వారు మక్కా, దుబాయ్, లండన్ తదితర కరోనా హాట్ స్పాట్ ల మీదుగా ఇండియాకు వచ్చి కరోనా పాజిటివ్ తేలారు. వారి సంఖ్య కూడా చాలా పరిమితమే. ఏపీలో అలాంటి వారి సంఖ్య సింగిల్ డిజిట్ స్థాయిలోనే అగుపించింది.
అయితే ఎప్పుడైతే తబ్లిగీ మర్కజ్ లో కరోనాను తీవ్రంగా అంటించుకుని, వారు దేశ వ్యాప్తంగా తమ తమ ప్రాంతాలకు వెళ్లారో.. అక్కడే వ్యవహారం తేడా కొట్టింది. తబ్లిగీ బ్యాచ్ కు, వారి ఇళ్లలోని వారికి పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. వారిల్లో కరోనా జాడలు బయటపడుతూనే ఉన్నాయి. ఏపీలో తబ్లిగీ వెళ్లి వచ్చిన వారికి దాదాపుగా కరోనా పరీక్షలు పూర్తయ్యాయి. దాదాపు 200 మంది వారిలో పాజిటివ్ గా తేలారు. ఇక వారి కుటుంబ సభ్యులు, వారిని కలిసిన వారికి పరీక్షలు కొనసాగుతున్నాయి. వారిలో మరో వంద మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్న పగలు, రాత్రి పరీక్షల్లో కొత్త కేసులు రిజిస్టర్ అయ్యాయి.
గత 24 గంటల్లో మరో 20 కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. ఇంకా పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక దేశంలో మహారాష్ట్ర నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. అక్కడ వెయ్యికి పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఆ తర్వాత తమిళనాడు, ఢిల్లీలు ముందున్నాయి. స్థూలంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 వేలను దాటేసింది. తబ్లిగీ పుట్ట పగిలినప్పుడు దేశంలో రోజుకు ఆరేడు వందల కేసులు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు ఆ సంఖ్య మూడు నుంచి నాలుగు వందల స్థాయికి వచ్చింది. ఇలా దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది. అయితే ఎన్నో కొన్ని బయటపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను మరో వారం పది రోజులు అయినా పొడిగించడమే పరిష్కారం మార్గంగా కనిపిస్తూ ఉంది.