2 లక్షల కేసులు.. లక్ష మంది డిశ్చార్జ్

భారత్ లో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8909 కేసులు నమోదవ్వడంతో.. మొత్త బాధితుల సంఖ్య 207,615కు చేరుకుంది. ఈరోజు ఉదయం 8 గంటల నాటికి…

భారత్ లో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8909 కేసులు నమోదవ్వడంతో.. మొత్త బాధితుల సంఖ్య 207,615కు చేరుకుంది. ఈరోజు ఉదయం 8 గంటల నాటికి దేశవ్యాప్తంగా లక్ష మంది కరోనా నుంచి కోలుకోగా.. మరో లక్ష మందికి పైగా చికిత్స కొనసాగుతోంది.

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 217 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5815కు చేరుకుంది. ఒకే రోజులో 2వందలకు పైగా మరణించడం వరుసగా ఇది మూడోసారి.

రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 72వేలకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 2287 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 2465 మంది మరణించారు. ముంబయి, థానె, పూణెలో అత్యథికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి

అటు తమిళనాడులో కొత్తగా 1091 కేసులు, ఢిల్లీలో 1298 కేసులు, గుజరాత్ లో 417 కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడులో కేసుల సంఖ్య 24,586కు.. ఢిల్లీలో కేసుల సంఖ్య 22,132కు, గుజరాత్ లో కేసుల సంఖ్య 17,617కు చేరుకుంది.

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం