ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తాజాగా 365కు పెరిగింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు జరిగిన కరోనా పరీక్షల్లో అనంతపురం జిల్లాలో 2 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి సంఖ్య 365కు చేరినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
మొత్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 892 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. వాటిలో 17 మాత్రమే పాజిటివ్ గా తేలాయి. గడిచిన 24 గంటల్లో 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 349 మంది చికిత్స పొందుతున్నారు.
తాజాగా బయటపడ్డ కేసులతో అనంతపురంలో కరోనా పాజిటివ్స్ సంఖ్య 15కు చేరింది. అటు కర్నూలు, కృష్ణా, నెల్లూరు, గుంటూరు నుంచి కొత్తగా పాజిటివ్ కేసులు బయటపడకపోవడం ప్రభుత్వానికి కాస్త ఊరట కలిగించే అంశం.
ప్రస్తుతం కర్నూలులో అత్యథికంగా 75 కేసులు నమోదు కాగా.. గుంటూరు (51), నెల్లూరు (48) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. విశాఖపట్నంలో నలుగురు మృతిచెందగా.. కృష్ణా నుంచి ఇద్దరు.. చిత్తూరు, ఈస్ట్, నెల్లూరు, ప్రకాశం నుంచి చెరొకరు చొప్పున కరోనా కారణంగా మరణించారు.