ప్రేమ ఎంత మధురం…క‌రోనా ఎంత క‌ఠినం!

ప్రేమ చాలా మ‌ధుర‌మైంది. లోకంలో అన్నిటి కంటే తియ్య‌నైన‌ది ఏద‌ని అడిగితే…ప్రేమ అని మాత్ర‌మే జ‌వాబు వ‌స్తుంది. అందుకే ఇష్ట‌మైన‌వి ద‌క్కించుకోవాలంటే చాలా శ్ర‌మ ప‌డాల్సి ఉంటుంది. ప్రేమ‌ను సొంతం చేసుకోవాలంటే చాలా త్యాగం…

ప్రేమ చాలా మ‌ధుర‌మైంది. లోకంలో అన్నిటి కంటే తియ్య‌నైన‌ది ఏద‌ని అడిగితే…ప్రేమ అని మాత్ర‌మే జ‌వాబు వ‌స్తుంది. అందుకే ఇష్ట‌మైన‌వి ద‌క్కించుకోవాలంటే చాలా శ్ర‌మ ప‌డాల్సి ఉంటుంది. ప్రేమ‌ను సొంతం చేసుకోవాలంటే చాలా త్యాగం చేయాల్సి ఉంటుంది. అంత సుల‌భంగా ప్రేమ ద‌క్క‌దు. ఒక్క ప్రేమ అనే కాదు…మ‌నం ఇష్ట‌ప‌డ్డ‌వి సాధించుకోవాలంటే కొన్ని వ‌దులు కోవాల్సి ఉంటుంది.

కొంత కాలంగా ప‌ర‌స్ప‌రం ప్రేమించుకుంటున్న ఓ జంట‌…ఒక్క‌టి కావ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చిందో ఉద‌హ‌రించే క‌థ‌నం ఇది. కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోడానికి 40 కిలోమీట‌ర్ల పాటు ఒంట‌రిగా న‌డిచి…ప్రేమికుడి వ‌ద్ద‌కు చేరుకుని తాళిక‌ట్టించుకోవాల్సి వ‌చ్చింది. క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ తెచ్చిన ఇబ్బందులు కొన్ని, పెద్ద‌ల‌కు ఇష్టం లేక‌పోవ‌డంతో మ‌రికొన్ని ఇబ్బందులు క‌లిసొచ్చాయి. వాటి అన్నింటిని వాళ్లిద్ద‌రి నిజ‌మైన ప్రేమ అధిగ‌మించింది.

కృష్ణా జిల్లా మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన కళ్ళేపల్లి సాయి పున్నయ్య, హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన సీహెచ్‌ భవానీ ప‌ర‌స్ప‌రం కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.  ఒక శుభోద‌యాన పెళ్లి బంధంతో ప్రేమ బంధాన్ని బ‌లోపేతం చేయాల‌ని దృఢంగా నిశ్చ‌యించుకున్నారు.

యువ‌తి త‌ల్లిదండ్రుల‌కు ఈ విష‌యం తెలిసింది. ప్రేమ దోమ కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రేమికుడైన పున్న‌య్య‌కు యువ‌తి త‌ల్లిదండ్రులు ఫోన్ చేసి…త‌మ కూతురి వైపు క‌ళ్లెత్తి చూస్తే ఖ‌బ‌ర్దార్ అని హెచ్చ‌రించారు. త‌ల్లిదండ్రుల బెదిరింపుల‌తో పెళ్లి కాదేమోన‌ని యువ‌తి ఆందోళ‌న‌కు గురైంది.

దీంతో ప్రేమికులిద్ద‌రూ ప‌ర‌స్ప‌రం ఫోన్ల‌లో మాట్లాడుకుని…పెళ్లి చేసుకుని ఎలాగైనా ఒక‌టి కావాల‌ని నిశ్చ‌యించుకున్నారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా ర‌వాణా సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. పెళ్లి చేసుకోవాల‌నే సంక‌ల్పం ముందు లాక్‌డౌన్ పెద్ద స‌మ‌స్య కాలేదు. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి ఒంటరిగా బయల్దేరిన భవానీ 40 కి.మీ కాలినడకన మచిలీపట్నం చేరుకుంది.  ప్రేమికులిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రేమికుల విన‌తి మేర‌కు పోలీసులు జోక్యం చేసుకొని ఇరు కుటుంబాలకు నచ్చజెప్పారు. దీంతో ఇరువైపు కుటుంబ స‌భ్యులు వారి పెళ్లిని అంగీక‌రించ‌డంతో ప్రేమ క‌థ సుఖాంత‌మైంది.

వర్షంలో మెగాస్టార్ ఇల్లు