మహారాష్ట్రలో మరణ మృదంగం

భారత్ లో కరోనా ఆట ఇప్పుడు మొదలైంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విధ్వసం కనివినీ ఎరుగని రీతిలో ఉంది. దీనికి రెండంటే రెండే ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఒకటి.. చైనా మొత్తం మీద కరోనా…

భారత్ లో కరోనా ఆట ఇప్పుడు మొదలైంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విధ్వసం కనివినీ ఎరుగని రీతిలో ఉంది. దీనికి రెండంటే రెండే ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఒకటి.. చైనా మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య 83,040 ఉండగా.. ఒక్క మహారాష్ట్రలోనే 85,975 కరోనా కేసులు నమోదయ్యాయి. రెండోది. ఇండియాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7135వేలు ఉంటే.. ఇందులో 3వేలకు పైగా మరణాలు మహారాష్ట్రలోనివే.

ఈ రెండు ఉదాహరణలు చాలు మహారాష్ట్రలో కరోనా ఏ స్థాయిలో విరుచుకుపడుతోందో చెప్పడానికి. ముంబయి సిటీ, ముంబయి సబర్బన్ తో పాటు.. థానె, పూణె, పాల్గర్, నాసిక్, నాగపూర్, అకోలా, షోలాపూర్, ఔరంగాబాద్, థూలె, హింగోళీ, రత్నగిరి.. ప్రాంతాల్లో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంది.

నిన్న ఒక్క రోజే మహారాష్ట్రలో 3007 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,975కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 3050కు చేరుకుంది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. తమిళనాడులో నిన్న ఒక్కరోజే 1515 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే.. కరోనా కేసుల సంఖ్య 256,611కు చేరుకుంది. ఇప్పటివరకు 7135 మంది మరణించగా.. 124,095 మంది కోలుకున్నారు.

కరోనా టాప్-5 రాష్ట్రాలు
మహారాష్ట్ర – మొత్తం కేసులు 85,975 – మృతులు 3060
తమిళనాడు – మొత్తం కేసులు 31,667 – మృతులు 269
ఢిల్లీ – మొత్తం కేసులు 27,654 – మృతులు 761
గుజరాత్ – మొత్తం కేసులు 20,070 – మృతులు 1249
రాజస్థాన్ – మొత్తం కేసులు 10,599 – మృతులు 240

రెండేళ్లు కాదు బాలయ్యా.. తర్వాత ఐదేళ్లూ ఆ పైన ఐదేళ్లూ జగనే సీఎం

కేటీఆర్ చాలా నిజాయితీ పరుడు