ఏపీలోనూ కరోనా భయాలు

హైదరాబాద్ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న కరోనా ఇప్పుడు ఏపీలో కూడా ప్రకంపనలు సృష్టించడం ప్రారంభించింది. కరోనా వైరస్ భయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పట్టిపీడిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా కరోనా వైరస్ జాడ లేనప్పటికీ.. ప్రజలు మాత్రం…

హైదరాబాద్ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న కరోనా ఇప్పుడు ఏపీలో కూడా ప్రకంపనలు సృష్టించడం ప్రారంభించింది. కరోనా వైరస్ భయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పట్టిపీడిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా కరోనా వైరస్ జాడ లేనప్పటికీ.. ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా తనకు కరోనా వచ్చిందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం శేషంనాయుడు కండ్రిగలో కరోనా వచ్చిందనే అనుమానంతో ఓ వ్యక్తి ఉరేసుకొని చనిపోయాడు. గ్రామానికి చెందిన 50 ఏళ్ల బాలకృష్ణ కొన్నాళ్లుగా ఊపిరితిత్తులు, కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో తనకు కరోనా వచ్చిందని భయపడ్డాడు బాలకృష్ణ. కుటుంబసభ్యుల్ని ఎవర్నీ దగ్గరకు రానీయలేదు. ఈ క్రమంలోనే ఉరేసుకొని చనిపోయాడు.

అటు కరోనా వైరస్ భయంతో తణుకు అంతటా మాంసాహార అమ్మకాలపై నిషేధం విధించారు. తణుకు నియోజకవర్గంలో గుర్తుతెలియని వైరస్ తో పౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లు చనిపోతున్నాయి. దీన్ని కరోనాగా గుర్తించనప్పటికీ..ఎందుకైనా మంచిదని ఈరోజు నుంచి చికెన్-మటన్ అమ్మకాలపై వారం రోజుల పాటు నిషేధం విధించారు అధికారులు. కోళ్లకు వచ్చిన వైరస్ కు కరోనాకు సంబంధం లేదని అధికారులు ప్రకటించినా ప్రజల్లో భయాలు తొలిగిపోలేదు.

మరోవైపు కరోనాకు సంబంధించి విజయవాడలో ప్రత్యేకంగా ఓ ఐసొలేషన్ వార్డ్ ఏర్పాటుచేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిసి గాంధీ ఆస్పత్రిలోనే కిట్స్ ఏర్పాటుచేసింది కేంద్రప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా అనుమానిత రోగులుంటే వాళ్లు సికింద్రాబాద్ లోని గాంధీకి వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంది. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా విజయవాడలో పరీక్ష కేంద్రంతో పాటు ప్రత్యేక వార్డు ఏర్పాటుచేయబోతున్నారు.

అటు చైనాను కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య వెయ్యికి చేరింది. నిన్న ఒక్క రోజే 108 మంది మరణించారు. వైరస్ సోకిన వారి సంఖ్య 42వేల 638కి చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం కూడా చైనా చేరుకొని వైద్య సేవలు అందిస్తోంది.

లోకేష్ ప్రెండ్ పై ఐటీ దాడులు చేస్తే మీరెందుకు