యూఎస్ క‌రోనా వ్యాక్సిన్.. తొలి ద‌శ విజ‌య‌వంతం

క‌రోనా నివార‌ణ‌కు మందు క‌నుగొన‌డం గురించి ప‌రిశోధిస్తున్న అమెరిక‌న్ ఫార్మా సంస్థ మోడెర్నా కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే ల్యాబ్ ద‌శ‌లో విజ‌య‌వంతం అయిన తాము రూపొందించిన వ్యాక్సిన్ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ లో కూడా…

క‌రోనా నివార‌ణ‌కు మందు క‌నుగొన‌డం గురించి ప‌రిశోధిస్తున్న అమెరిక‌న్ ఫార్మా సంస్థ మోడెర్నా కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే ల్యాబ్ ద‌శ‌లో విజ‌య‌వంతం అయిన తాము రూపొందించిన వ్యాక్సిన్ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ లో కూడా విజ‌య‌వంతం అవుతోంద‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. మార్చి నెల‌లోనే వాలంట‌రీగా ముందుకు వ‌చ్చిన వారిపై హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ మొద‌ల‌య్యాయి. మొత్తం 8 మంది మీద ఈ ప్ర‌యోగాల‌ను నిర్వ‌హించారు. అందుకు సంబంధించి ప‌రిశీల‌న‌ల అనంత‌రం, ఆ మందు విజ‌య‌వంతం అయ్యింద‌ని మోడెర్నా ఫార్మా ప్ర‌క‌టించింది.

మొత్తం మూడు డోసేజ్ ల‌తో ప్ర‌యోగాలు నిర్వ‌హించిన‌ట్టుగా వివ‌రించింది. లో , మీడియం, హై డోసేజ్ ల‌తో ప్ర‌యోగం జ‌రిగింద‌ని, ఈ ప్ర‌యోగంలో హై డోసేజ్ మాత్రం తేడా కొట్టింద‌ని పేర్కొంది. జ్వ‌రం, ఇత‌ర సైడెఫెక్ట్స్ త‌లెత్తాయ‌ట హై డోసేజ్ తో, కానీ ఒక్క రోజులోనే మ‌ళ్లీ ఆ జ్వ‌రం, నొప్పులు కూడా త‌గ్గిపోయాయ‌ని ప‌రిశోధ‌న సంస్థ ప్ర‌క‌టించింది. హై డోసేజ్ గురించి ప‌రీక్ష‌లే అన‌వ‌స‌రం అని, ఎలాగూ హై డోసేజ్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని ఆ సంస్థ చెబుతోంది. లో, మీడియం డోసేజ్ ల మీదే త‌దుప‌రి ప‌రీక్ష‌లు చేయ‌నున్నట్టుగా తెలిపింది.

ఇక రెండో ఫేస్ లో మొత్తం 600 మంది మీద ఈ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌బోతున్న‌ట్టుగా ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించి అమెరిక‌న్ ప్ర‌భుత్వ అనుమ‌తి కూడా జారీ అయిన‌ట్టుగా స‌మాచారం. రెండో ద‌శ ప్ర‌యోగం కూడా విజ‌య‌వంతం అయితే, మూడో ద‌శ‌లో కొన్ని వేల మంది మీద ఈ మందును ప్ర‌యోగించి చూస్తారు. క‌రోనా నివార‌ణ‌కు యాండీ బాడీస్ ను జ‌నింప‌జేయ‌డం ఈ మందు ప్ర‌యోగం ఉద్ధేశం. యాంటీ బాడీస్ జ‌న‌రేట్ కావాలి కానీ, సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌కూడ‌దు, తాత్కాలికంగా అయినా, దీర్ఘ‌కాలికంగా అయినా సైడ్ ఎఫెక్ట్స్ లేని రీతిలో ఈ మందును త‌యారు చేయాల్సి ఉంది.

ల్యాబ్ ద‌శ‌లో ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డం, తొలి ద‌శ‌లో 8 మంది మీదా ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంతో.. 600 మంది మీద ప్ర‌యోగించ‌నున్నారు, ఆ త‌ర్వాత వేల సంఖ్య‌లో వ్య‌క్తుల మీద ప్ర‌యోగాలు జ‌ర‌గ‌బోతున్నాయి. అవి కూడా విజ‌య‌వంతం అయితే అప్పుడు అధికారికంగా మందును అందుబాటులోకి తీసుకొస్తారు. మిగ‌తా రెండు ద‌శ‌ల ప్ర‌యోగాలూ పూర్త‌య్యేందుకు మ‌రి కాస్త స‌మ‌యం ప‌ట్టొచ్చని అంటున్నారు. ఈ ఏడాది చివ‌ర‌కు లేదా, వ‌చ్చే ఏడాది ప్రారంభానికి క‌ల్లా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చ‌ని అంచ‌నా.

కేసీఆర్ న్యూ రూల్స్ అదుర్స్